
నెల్లూరు: జిల్లాలో టీడీపీ గూండాల అరాచకం కొనసాగుతోంది. సోమవారం(జూలై 7) రాత్రి సమయంలో మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ ఇంటిపై టీడీపీ నేతలు దాడికి పాల్పడ్డారు.
నెల్లూరులోని సావిత్రి నగర్‌లో ఉన్న ప్రసన్న కుమార్ ఇంటిపై ఎంపీ వేమిరెడ్డి అనుచరులు దాడి చేశారు. ప్రసన్న కుమార్ ఇంట్లో ఫర్నీచర్ ధ్వంసం చేశారు. ఆయన ఇంటి దగ్గర ఉన్న రెండు కార్లు ధ్వంసం చేశారు.