నడిరోడ్డుపై 14 గుడ్లు పెట్టిన పాము | snake lays 14 eggs in the middle of a street at karnataka | Sakshi

ఒకటా...రెండా... ఏకంగా 14 గుడ్లు మరి!

Mar 24 2019 9:10 AM | Updated on Mar 24 2019 9:38 AM

snake lays 14 eggs in the middle of a street at karnataka - Sakshi

కోడి గుడ్డు పెట్టడం చూశారా.. అంటే వెంటనే ఓ.. చూశాం మా ఇంట్లో చాలా కోళ్లున్నాయి. చాలా గుడ్లు పెట్టేవి అని చాలా మంది నుంచి సమాధానం వస్తుంది.

కోడి గుడ్డు పెట్టడం చూశారా.. అంటే వెంటనే ఓ.. చూశాం మా ఇంట్లో చాలా కోళ్లున్నాయి. చాలా గుడ్లు పెట్టేవి అని చాలా మంది నుంచి సమాధానం వస్తుంది. అదే పాము గుడ్డు పెట్టడం చూశారా అంటే నోట మాటరాదు. అమ్మో పామును చూస్తేనే సగం చస్తాం. అలాంటిది అది గుడ్డు పెడుతుంటే చూడటమా.. అంత ధైర్యం లేదు బాబోయ్‌ అనేస్తాం. మీలాగే కర్ణాటకలోని మద్దూరు అనే పట్టణంలో ఓ టీచర్‌ తన ఇంట్లోకి జొరపడ్డ ఆడ నాగుపామును చూసి భయపడిపోయాడు. పాములు పట్టే వ్యక్తి అయిన ప్రసన్న కుమార్‌ను పిలిపించాడు.

అతడు వచ్చి దాన్ని పట్టుకుందామనుకునే లోపే అది రోడ్డుపైకి పరుగు తీసింది. వారు రోడ్డుపైకి వెళ్లేలోపే గుండ్రంగా చుట్టుకుని గుడ్లు పెట్టడం మొదలు పెట్టింది. అలా ఒక్కటి కాదు రెండు కాదు ఏకంగా 14 గుడ్లు పెట్టింది ఆ పాము. తర్వాత ఆ నాగుపామును గుడ్లతో పాటు సురక్షితంగా దగ్గరలోని అడవిలో ప్రసన్న కుమార్‌ వదిలిపెట్టి వచ్చాడు. ఈ తతంగం మొత్తాన్ని అక్కడి జనం ఆతృతగా చూశారు. కానీ పామును ఏ మాత్రం డిస్టర్బ్‌ చేయలేదు. ఈ మొత్తాన్ని ఆ టీచర్‌ వీడియో తీసి సామాజిక మాధ్యమంలో పెట్టడంతో ఆ వీడియో తెగ వైరల్‌ అయింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement