ఆంధ్రప్రదేశ్ ఎస్‌ఎస్‌సీ బోర్డు డైరెక్టర్ ప్రసన్నకుమార్ ఏసీబీ వలలో చిక్కారు. డీఈడీ విద్యార్థుల ధ్రువపత్రాలు పరిశీలించడం కోసం రూ. 10 లక్షలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ప్రసన్నకుమార్ ఒక్కో విద్యార్థి నుంచి రూ. 1000 చొప్పున వసూలు చేస్తున్నారనే సమాచారంతో గురువారం రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు డెరైక్టర్‌ను అదుపులోకి తీసుకొని విచారణ చేపడుతున్నారు. ఈ సంఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.