DED students
-
‘బీఈడీలకు ఎస్జీటీ అవకాశం కల్పించొద్దు’
కామారెడ్డి క్రైం: బీఈడీ అభ్యర్థులకు ఎస్జీటీ అవకాశం కల్పించాలన్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డీఈడీ విద్యార్థులు డిమాండ్ చేశారు. సోమవారం కామారెడ్డి కొత్తబస్టాండ్ నుంచి కలెక్టరేట్ ధర్నా చౌక్ వరకు ర్యాలీ తీశారు. ధర్నాచౌక్‌లో బైఠాయించి నిరసన తెలిపారు. బీఈడీ అభ్యర్థులకు అవకాశం కల్పించడం వల్ల తమకు అన్యాయం జరుగుతుందన్నారు. ఎస్జీటీ పోస్టులను కేవలం డీఎడ్ అభ్యర్థులతోనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో జిల్లాలోని ఎస్వీ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, అబ్దుల్‌కలామ్ కళాశాల, అహ్మద్ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. -
డీఎడ్ చదివీ కూలికెళ్తున్నా..
కోవెలకుంట్ల: ‘నేను డిగ్రీ తర్వాత డీఎడ్ పూర్తి చేసినా ఉద్యోగం లేని కారణంగా దినసరి కూలికి వెళ్లి కుటుంబాన్ని పోషించుకోవాల్సి వస్తోంది.. నాలా ఉన్నత చదువులు చదివి కూలికెళ్తున్నవారు చాలామంది ఉన్నారు’.. అంటూ వాణి అనే యువతి జగన్ ఎదుట ఆవేదన వ్యక్తం చేసింది. ప్రజాసంకల్ప యాత్ర శనివారం కోవెలకుంట్ల మండలం భీమునిపాడు గ్రామ శివారుకు చేరుకోగానే.. సీడు పత్తి పొలంలో పనిచేస్తున్న కూలీలు జగన్‌ను కలిసేందుకు వచ్చారు. వారిలో వాణి అనే యువతి ముందుకొచ్చి ‘ఇంటికో ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు దాన్ని నెరవేర్చకపోవడం వల్లే నాకు ఈ దుస్థితి వచ్చింది.. నా తండ్రికి గుండె జబ్బు. నాకొస్తున్న రూ.200 కూలితోనే కుటుంబాన్ని పోషించుకోవాల్సి వస్తోంది..’ అంటూ వాపోయింది. అలాగే నవీనా అనే యువతి మాట్లాడుతూ ‘నేను ఎం ఫార్మసీ పూర్తిచేసినా ఇప్పటివరకూ ఉద్యోగం రాలేదు’ అని జగన్‌కు విన్నవించుకుంది. వైఎస్సార్సీపీ అధికారంలోకి రాగానే అందరికీ న్యాయం జరుగుతుందని జగన్ వారికి భరోసా ఇచ్చారు. -
ఏసీబీ వలలో ఎస్ఎస్సీ బోర్డు డైరెక్టర్
-
ఏసీబీ వలలో ఎస్ఎస్సీ బోర్డు డైరెక్టర్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ఎస్ఎస్సీ బోర్డు డైరెక్టర్ ప్రసన్నకుమార్ ఏసీబీ వలలో చిక్కారు. డీఈడీ విద్యార్థుల ధ్రువపత్రాలు పరిశీలించడం కోసం కాలేజ్ యాజమాన్యాల నుంచి రూ. 10 లక్షలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. బీఎడ్, డీఎడ్ కాలేజీల్లో మేనేజ్ మెంట్ కోటాలో జాయినయ్యే ప్రతి విద్యార్థి నుంచి రూ. 1000 రూపాయల చొప్పున ఆయన వసూలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సమాచారంతో గురువారం రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు డెరైక్టర్‌ను అదుపులోకి తీసుకొని విచారణ చేపడుతున్నారు. ఈ సంఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
హాల్‌టికెట్ల కోసం డీఈడీ విద్యార్థుల రాస్తారోకో
-
హాల్‌టికెట్ల కోసం డీఈడీ విద్యార్థుల రాస్తారోకో
ఒంగోలు: పరీక్ష కొద్దిసేపట్లో రాయాల్సి ఉన్నా హాల్‌టికెట్లు ఇవ్వనందుకు నిరసనగా సోమవారం ఉదయం డీఈడీ విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఒంగోలు లోని పేర్నమిట్ట వెంకటసాయి డీఈడీ కాలేజీ, ఎన్.ఆగ్రహారంలోని లిటిల్ స్టార్ డీఈడీ కాలేజీలకు చెందిన సుమారు 40 మంది పరీక్ష కేంద్రమైన కర్నూలు రోడ్డులో ఉన్న జేవియర్ కళాశాల వద్ద రాస్తారోకో చేశారు. వెంటనే హాల్ టికెట్లు ఇవ్వాలని కోరారు. పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షించుకుంటున్నారు. గుంటూరు: గుంటూరు జిల్లాలో కూడా విద్యార్థులు ఆందోళనకు దిగారు. జిల్లాలోని వినుకొండలోని జీఎస్ఆర్ డీఈడీ కళాశాల వద్ద విద్యార్థులు ధర్నా చేప్టటారు. కొద్దిసేపట్లో పరీక్షలు రాయాల్సి ఉన్నా ఇప్పటికీ హాల్‌టికెట్లు ఇవ్వలేదని ప్రిన్సిపల్ చాంబర్ వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. వెంటనే హాల్‌టికెట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. -
సీఎం కిరణ్ చెక్కబొమ్మ: ఆర్.కృష్ణయ్య
హైదరాబాద్, న్యూస్‌లైన్: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి చెక్క బొమ్మ అని, ఆయన సీఎం అయినప్పటి నుంచి రాష్ట్రానికి శని పట్టిందని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య విమర్శించారు. డీఈడీ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో గురువారం ఇందిరాపార్కులో జరిగిన ధర్నాకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ డీఈడీ 2012-14 బ్యాచ్ విద్యార్థులకు మొదటి సంవత్సరం పూర్తయినా నేటికీ వార్షిక పరీక్షలు నిర్వహించకపోవడం దుర్మార్గమన్నారు. తక్షణమే వారికి వార్షిక పరీక్షలు జరపాలని, ఆఖరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు టెట్‌కు అవకాశం కల్పించి డీఎస్సీకి అర్హత కల్పించాలని డిమాండ్ చేశారు. లేకపోతే కిరణ్ ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. -
బోధకులు అరకొరే!
మహబూబ్‌నగర్ విద్యావిభాగం, న్యూస్‌లైన్: ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత నుంచి కా..స్త ఉపశమనం కలిగినట్లే. జిల్లా విద్యాధికారుల అభ్యర్థన మేరకు విద్యాబోధకుల(అకాడమిక్ ఇన్స్ట్రక్టర్) నియామకానికి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ప్రభుత్వం ఈ మేరకు జిల్లాకు 123 మంది విద్యాబోధకులను నియమించింది. అలాగే ఉర్దూ మీడియం పాఠశాలల్లో 84 మంది విద్యాబోధకుల పోస్టులను కేటాయించింది. అయితే జిల్లాకు 990 మంది విద్యాబోధకులు అవసరం ఉండగా, కేవలం 123 పోస్టులు మాత్రమే కేటాయించడంతో అధికారులు ఈ అరకొర పోస్టులు ఎక్కడ కేటాయించాలనే విషయమై ఆలోచనలోపడ్డారు. బడిబయటి పిల్లలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలు, ఏకోపాధ్యాయ పాఠశాలలకు ఈ పోస్టులను కేటాయించేందుకు కసరత్తు చేస్తున్నారు. అదే విధంగా పోస్టులు తక్కువగా ఉండటంతో ప్రభుత్వం చెల్లించాలని భావించిన రూ.ఐదువేలు ఉన్న వేతనాన్ని రూ.మూడువేలకు కుదించి జిల్లాలో పోస్టుల సంఖ్యను పెంచేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. విద్యాబోధకులుగా బీఈడీ, డీఈడీ విద్యార్హతలు కలిగిన అభ్యర్థులను రోస్టర్, మెరిట్ పద్ధతిన తీసుకుంటారు. ఈ నియామక ప్రక్రియను మరో పదిరోజుల్లో పూర్తిచేస్తామని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. తక్కువ వేతనం..ఎక్కువ పోస్టులు జిల్లాలో మొత్తం 990 ఎస్జీటీ పోస్టులు ఖాళీగా ఉండగా కేవలం 123 మంది వి ద్యాబోధకులను నియమించుకునేందుకు మాత్రమే ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఒక్క ఉపాధ్యాయుడు కూడా లేని, ఒక్కో ఉపాధ్యాయుడు ఉండి పాఠశాలను నడిపిస్తున్న జిల్లాకు ప్రస్తుతం కేటాయించిన పోస్టులు ఎక్కడా సరిపోవు. అయితే ఈ సమస్యలను తగ్గించేందుకు కలెక్టర్ ఆదేశానుసారం ఆర్వీఎం అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలోని ఉపాధ్యాయుల కొరత, బడిబయటి పిల్లలు ఎక్కువగా ఉన్న 27 మండలాలకు మాత్రమే విద్యాబోధకులను నియమించేందుకు నిర్ణయించినట్లు తెలిసింది. గట్టు మండలానికి 20, ధరూర్‌కు 15, ఐజకు 15, గద్వాలకు 3, దౌల్తాబాద్‌కు 10, మల్దకల్‌కు 8, పెద్దకొత్తపల్లికు 6, నారాయణపేటకు 02, వెల్దండకు 3, కొడంగల్‌కు 5, అమ్రాబాద్‌కు 15, అచ్చంపేటకు 15, లింగాలకు 10, ఉప్పునుంతలకు 5, బల్మూర్‌కు 5, అలంపూర్‌కు 5, పెద్దమందడికి 8, ధన్వాడకు 2, వంగూరుకు 3, మక్తల్‌కు 5, మాగనూర్‌కు 8, మద్దూరుకు 5, కోస్గికి 8, మహబూబ్‌నగర్ మండలానికి 5, కోడేరు మండలానికి 5, నర్వ మండలానికి 6, బోంరాస్‌పేట మండలానికి 8 పోస్టుల చొప్పున 27 మండలాలలకు 205 పోస్టులను కేటాయించేందుకు అధికారులు కసరత్తులు చేస్తున్నట్లు తెలిసింది. అదేవిధంగా ఉర్దూపాఠశాలల్లోనూ 84 నుంచి 140 వరకు పోస్టులు పెరిగే అవకాశం ఉంది. ఉపాధ్యాయులు లేని పాఠశాలలతో పాటు బడిబయటి పిల్లలు ఎక్కువగా ఉన్న ఏకోపాధ్యాయ పాఠశాలల్లో నియామకాలకు ప్రాధాన్యం ఇస్తారు. వీరికి వేతనాలు చెల్లించేందుకు అవసరమయ్యే రూ.45లక్షలను ఎన్‌ఆర్‌ఎస్‌టీసీ లేదా ఆర్‌ఎస్‌టీసీ విభాగాల నుంచి తీసుకుంటారు. ఏదేమైనా ఉపాధ్యాయుల కొరత ఎక్కువగా ఉన్న పాలమూరు జిల్లాకు విద్యాబోధకుల సంఖ్యను పెంచి నియామకాలు చేపట్టాలని ఉపాధ్యాయ, విద్యార్థి సంఘాలు కోరుతున్నాయి. 10 రోజుల్లో ప్రక్రియ పూర్తి పోస్టులు తక్కువగా రావడం వల్ల ఎక్కడ ఏవిధంగా కేటాయించాలనే దానిపై కసరత్తు చేస్తున్నాం. కలెక్టర్ ఆదేశాల మేరకు నియామకాలు చేపడుతాం. ఉపాధ్యాయుల కొరత ఉన్న విషయాన్ని కలెక్టర్ ఎ స్పీడీ దృష్టికి కూడా తీసుకెళ్లారు. త్వరలో దరఖాస్తులు స్వీకరించి 10రోజులల్లో విద్యాబోధకుల ప్రక్రియను పూర్తిచేస్తాం. - పద్మహర్ష, పీఓ, రాజీవ్ విద్యామిషన్