
కామారెడ్డిలో ర్యాలీ నిర్వహిస్తున్న డీఎడ్ విద్యార్థులు
కామారెడ్డి క్రైం: బీఈడీ అభ్యర్థులకు ఎస్జీటీ అవకాశం కల్పించాలన్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డీఈడీ విద్యార్థులు డిమాండ్ చేశారు. సోమవారం కామారెడ్డి కొత్తబస్టాండ్ నుంచి కలెక్టరేట్ ధర్నా చౌక్ వరకు ర్యాలీ తీశారు.
ధర్నాచౌక్‌లో బైఠాయించి నిరసన తెలిపారు. బీఈడీ అభ్యర్థులకు అవకాశం కల్పించడం వల్ల తమకు అన్యాయం జరుగుతుందన్నారు. ఎస్జీటీ పోస్టులను కేవలం డీఎడ్ అభ్యర్థులతోనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.
అనంతరం కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో జిల్లాలోని ఎస్వీ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, అబ్దుల్‌కలామ్ కళాశాల, అహ్మద్ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment