పరీక్ష కొద్దిసేపట్లో రాయాల్సి ఉన్నా హాల్‌టికెట్లు ఇవ్వనందుకు నిరసనగా సోమవారం ఉదయం డీఈడీ విద్యార్థులు ఆందోళనకు దిగారు.
ఒంగోలు: పరీక్ష కొద్దిసేపట్లో రాయాల్సి ఉన్నా హాల్‌టికెట్లు ఇవ్వనందుకు నిరసనగా సోమవారం ఉదయం డీఈడీ విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఒంగోలు లోని పేర్నమిట్ట వెంకటసాయి డీఈడీ కాలేజీ, ఎన్.ఆగ్రహారంలోని లిటిల్ స్టార్ డీఈడీ కాలేజీలకు చెందిన సుమారు 40 మంది పరీక్ష కేంద్రమైన కర్నూలు రోడ్డులో ఉన్న జేవియర్ కళాశాల వద్ద రాస్తారోకో చేశారు. వెంటనే హాల్ టికెట్లు ఇవ్వాలని కోరారు. పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షించుకుంటున్నారు.
గుంటూరు: గుంటూరు జిల్లాలో కూడా విద్యార్థులు ఆందోళనకు దిగారు. జిల్లాలోని వినుకొండలోని జీఎస్‌ఆర్ డీఈడీ కళాశాల వద్ద విద్యార్థులు ధర్నా చేప్టటారు. కొద్దిసేపట్లో పరీక్షలు రాయాల్సి ఉన్నా ఇప్పటికీ హాల్‌టికెట్లు ఇవ్వలేదని ప్రిన్సిపల్ చాంబర్ వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. వెంటనే హాల్‌టికెట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.