ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి చెక్క బొమ్మ అని, ఆయన సీఎం అయినప్పటి నుంచి రాష్ట్రానికి శని పట్టిందని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య విమర్శించారు.
హైదరాబాద్, న్యూస్‌లైన్: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి చెక్క బొమ్మ అని, ఆయన సీఎం అయినప్పటి నుంచి రాష్ట్రానికి శని పట్టిందని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య విమర్శించారు. డీఈడీ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో గురువారం ఇందిరాపార్కులో జరిగిన ధర్నాకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ డీఈడీ 2012-14 బ్యాచ్ విద్యార్థులకు మొదటి సంవత్సరం పూర్తయినా నేటికీ వార్షిక పరీక్షలు నిర్వహించకపోవడం దుర్మార్గమన్నారు. తక్షణమే వారికి వార్షిక పరీక్షలు జరపాలని, ఆఖరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు టెట్‌కు అవకాశం కల్పించి డీఎస్సీకి అర్హత కల్పించాలని డిమాండ్ చేశారు. లేకపోతే కిరణ్ ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు.