మార్పుకోసం | Maro Adugu Marpu Kosam Movie First Look Launch | Sakshi
Sakshi News home page

మార్పుకోసం

Oct 2 2018 2:58 AM | Updated on Oct 2 2018 2:58 AM

Maro Adugu Marpu Kosam Movie First Look Launch - Sakshi

ప్రసన్నకుమార్, వెంకటపతి రాజు

నటుడిగా సుదీర్ఘ ప్రయాణం చేసిన ప్రసన్నకుమార్‌ లీడ్‌ రోల్‌లో నటించి, స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘మరో అడుగు మార్పుకోసం’. త్వరలో రిలీజ్‌ కానున్న ఈ సినిమా ఫస్ట్‌ లుక్, టీజర్‌ని ప్రముఖ క్రికెటర్‌ వెంకటపతి రాజు విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘ప్రసన్నకుమార్‌ నాకు చిన్నప్పటి నుంచి మిత్రుడు. వైజాగ్‌లో తరచూ అతని జిమ్‌కి వెళ్లేవాళ్లం. ఈ సినిమా కథ విని, ఆశ్చర్యపోయా. ఇలాంటి కాన్సెప్ట్‌తో బోల్డ్‌ అటెంప్ట్‌ చేసినందుకు అభినందిస్తున్నా. ఈ సినిమా మంచి విజయం సాధించాలి’’ అన్నారు.

‘‘సినిమా మీద ప్యాషన్‌తో ఈ రంగంలో కొనసాగుతున్నాను. అదే బాధ్యతతో ఈ చిత్రం తీశా. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఈ సినిమా పూర్తి చేశా’’ అన్నారు ప్రసన్నకుమార్‌. ‘‘సినిమాను నమ్మితే తప్పకుండా గొప్పవాళ్లను చేస్తుంది. ప్రసన్నకుమార్‌ కష్టం నాకు తెలుసు. మా బ్యానర్‌లో వచ్చిన ‘బిచ్చగాడు’లా ఈ సినిమా విజయం సాధించాలని కోరుకుంటున్నా’’ అన్నారు నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు. ప్రముఖ నృత్యదర్శకులు శివసుబ్రమణ్యం రాజు దంపతులను సన్మానించారు. దర్శకుడు అజయ్‌ కుమార్, నటుడు అఖిల్‌ కార్తీక్‌ పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement