‘సీతారామపురంలో..’ విజయం ఖాయం | Seetharamapuram Lo Oka Prema Janta Movie Pre Release Highlights | Sakshi
Sakshi News home page

‘సీతారామపురంలో..’ విజయం ఖాయం

Published Sun, Nov 13 2022 4:59 PM | Last Updated on Sun, Nov 13 2022 5:01 PM

Seetharamapuram Lo Oka Prema Janta Movie Pre Release Highlights - Sakshi

శ్రీ ధనలక్ష్మీ మూవీస్‌ పతాకంపై బీసు చందర్‌ గౌడ్‌ నిర్మిస్తున్న ప్రేమ కథాచిత్రం ‘సీతారామపురంలో ఒక ప్రేమ జంట...’ ప్రపంచ వ్యాప్తంగా నవంబర్‌ 18న అత్యధిక థియేటర్లలో విడుదలకు సిద్దమవుతోంది. ఎం. వినయ్‌ బాబు దర్శకత్వంలో రణధీర్‌, నందినీ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ భారీ బడ్జెట్‌ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈ నెల 18న విడుదలకానుంది. ఈ సందర్భంగా ఈ రోజు ప్రసాద్‌ ల్యాబ్స్‌లో ప్రీ `- రిలీజ్  సమావేశం ఏర్పాటు చేశారు.

ఈ కార్యక్రమంలో  మాజి ఎమ్మెల్యే మోత్కుపల్లి నర్సింహులు మాట్లాడుతూ...‘నిర్మాత నాకు బాగా కావాల్సినవాడు. ఎటువంటి సినిమా నేపథ్యం లేకున్నా తన కొడుకుని హీరోగా పరిచయం చేస్తూ ఈ చిత్రాన్ని నిర్మించే ధైర్యం చేయడం గొప్ప విషయం. రణధీర్‌కు ఒక మంచి హీరోగా ఎదడానికిగల అన్ని క్వాలిటీస్‌ ఉన్నాయి. పాటలు, ట్రైలర్స్‌ , టైటిల్‌ ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. ఈ సినిమాకు పని చేసిన ప్రతి ఒక్కరికీ శుభాకాంక్షలు తెలుపుతూ..ఈ సినిమా ఘన విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా’ అన్నారు.

తెలుగు ఫిలించాంబర్‌ సెక్రటరీ ప్రసన్న కుమార్‌ మాట్లాడుతూ... సీతారామ పేరుతో వచ్చిన చిత్రాలన్నీ ఘన విజయం సాధించాయి. ఆ కోవలో ఈ చిత్రం కూడా పెద్ద సక్సెస్‌ కావడం ఖాయం. సినిమా చూశాను. చాలా బాగా వచ్చింది. ముఖ్యంగా క్లైమాక్స్‌ సినిమాకు ప్రాణం. దర్శక నిర్మాతలు ఎక్కడా రాజీ పడకుండా ఈ సినిమాను అద్భుతంగా తీర్చిదిద్దారు’అన్నారు.

నిర్మాత బీసు చందర్‌ గౌడ్‌ మాట్లాడుతూ...‘విలేజ్‌ బ్యాక్‌డ్రాప్‌లో జరిగే విభిన్నమైన ప్రేమకథా చిత్రమిది. ఇప్పటి వరకు గ్రామీణ నేపథ్యంలో ఎన్నో ప్రేమకథా చిత్రాలు వచ్చాయి. కానీ వాటికి మా చిత్రానికి ఎంతో డిఫరెన్స్‌ ఉంది. దర్శకుడు వినయ్‌బాబు అత్భుతమైన ట్విస్ట్‌లతో సినిమాను ఇంట్రెస్టింగ్‌గా తెరక్కించారు. కచ్చితంగా ఇదొక ట్రెండ్‌ సెట్టర్‌గా నిలుస్తోంది. అంతర్లీనంగా మంచి సందేశం కూడా ఉంటుంది. ఈ నెల 18న వస్తోన్న మా చిత్రాన్ని యువతో పాటు ప్రతి తల్లీదండ్రి చూసేలా ఉంటుందన్నారు.  ‘ఈ చిత్రంలో మంచి కంటెంట్‌తో పాటు కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ కూడా ఉన్నాయి’అని దర్శకుడు ఎమ్‌ విజయ్‌ బాబు అన్నారు.  ఈ కార్యక్రమంలో హీరో దణధీర్‌, హీరోయిన్‌ నందినిలతో పాటు నిర్మాత  తుమ్మలపల్లి రామసత్యనారాయణ, దర్శకులు వియన్‌ ఆదిత్య, చంద్రమహేష్‌,కాశీవిశ్వనాథ్‌ తదితరులు పాల్గొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement