
అనిల్ బురగాని, ఆర్.జ్వలిత జంటగా నటించిన చిత్రం ‘ప్రేమకు జై’. మల్లం శ్రీనివాస్ దర్శకత్వంలో అనసూర్య నిర్మించిన ఈ చిత్రం మార్చిలో విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకకు దర్శక–నిర్మాత సాయి వెంకట్ అతిథిగా హాజరై, ఈ సినిమా విజయం సాధించాలని ఆకాంక్షించారు.
మల్లం శ్రీనివాస్ మాట్లాడుతూ–‘‘గ్రామీణ నేపథ్యంలో ఓ వాస్తవ ఘటన ఆధారంగా ఈ సినిమా తీశాం. హీరో అనిల్ బురగాని, హీరోయిన్ జ్వలిత చాలా బాగా చేశారు. ప్రతి ఒక్క ఆర్టిస్టు, టెక్నీషియన్స్ కృషి, సపోర్ట్ వల్లే ఈ సినిమా ఇంత బాగా వచ్చింది. క్వాలిటీ విషయంలో నిర్మాత ఎంతో సహకరించారు. 'ప్రేమకు జై' సినిమాను ఆదరించాలని ప్రేక్షకులను కోరుకుంటున్నాం." అని అన్నారు.
కో ప్రోడ్యూసర్: మైలారం రాజు మాట్లాడుతూ.. యూత్ కు నచ్చే సబ్జెక్టును దర్శకుడు చాలా బాగా తెరకేక్కించారు. వచ్చే నెలలో థియేటర్లలో విడుదల కానున్న 'ప్రేమకు జై' సినిమాను చూసి ప్రతి ఒక్కరూ జై కొడతారని ఆశిస్తున్నాము." అని అన్నారు.
హీరోహీరోయిన్లు అనిల్ బురగాని, ఆర్ జ్వలిత మాట్లాడుతూ.. ఇంత మంచి సినిమాలో తమకు అవకాశం ఇచ్చిన దర్శకనిర్మాతలకు కృతజ్ఙతలు తెలిపారు. సినిమాను ప్రతి ఒక్కరూ ఆదరించాలని ప్రేక్షకులకు విజ్ఞప్తి చేశారు.
'ప్రేమకు జై' ఫ్రీరిలీజ్ వేడుకలో నటుడు అధిరే అభి, నిర్మాత ఎమ్ ఆర్ చౌదరి వడ్లపట్ల, నిర్మాత చందర్ గౌడ్, దర్శకుడు లారెన్స్ పలువురు సినీ ప్రముఖులు పాల్గొని చిత్ర యూనిట్ కు శుభాకాంక్షలు తెలిపారు. వచ్చే నెలలో సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment