సామాన్యుడిని ఇబ్బంది పెడితే.. మూల్యం చెల్లించాల్సిందే | Samanyudi Dhairyam Movie Opening Ceremony Highlights | Sakshi
Sakshi News home page

సామాన్యుడిని ఇబ్బంది పెడితే.. మూల్యం చెల్లించాల్సిందే

Published Sun, Aug 21 2022 5:38 PM | Last Updated on Sun, Aug 21 2022 5:51 PM

Samanyudi Dhairyam Movie Opening Ceremony Highlights - Sakshi

కరోనాతో హాలీవుడ్‌, బాలీవుడ్‌ కొలాప్స్‌ అయినా.. టాలీవుడ్‌ మాత్రం సక్సెస్‌ బాటలో పయనించింది. ఇటీవ‌ల టికెట్ రేట్లు పెంచ‌డంతో సామాన్యుడి ఆగ్ర‌హానికి గురై  సినిమాల‌న్నీ వెల‌వెల‌బోయాయి. మళ్లీ టికెట్లు రేట్లు తగ్గించడంతో బింబిసార‌, సీతారామం, కార్తికేయ-2 చిత్రాలు హౌస్ ఫుల్ క‌లెక్ష‌న్స్ తో దూసుకెళ్తున్నాయి. సామాన్యుడిని ఇబ్బంది పెడితే ఎంత గొప్ప వారైనా మూల్యం చెల్లించాల్సిందే. అటువంటి మంచి టైటిల్ వస్తున్న ‘సామాన్యుడి ధైర్యం` చిత్ర యూనిట్‌కి అభినందనలు. ఈ చిత్రం భారీ విజయం సాధించాలని కోరుకుంటున్నాను’అని తెలుగు ప్రొడ్యూస‌ర్ కౌన్సిల్ సెక్ర‌ట‌రీ ప్ర‌స‌న్న కుమార్‌ అన్నారు.

రామ్‌ బొత్స దర్శకత్వంలో సీహెట్‌ నరేశ్‌ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం‘సామాన్యుడి ధైర్యం`.శ్రీ ల‌క్ష్మీ వెంక‌టేశ్వ‌ర ఎంట‌ర్ టైన్ మెంట్ ప‌తాకంపై ప్రొడ‌క్ష‌న్ నెం-1 గా రమణ కొఠారు నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రారంభ‌త్సోవం శనివారం హైదరాబాద్‌లోని ఫిలించాంబ‌ర్ లో జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన తెలుగు ప్రొడ్యూస‌ర్ కౌన్సిల్ సెక్ర‌ట‌రీ ప్ర‌స‌న్న కుమార్ ముహూర్త‌పు స‌న్నివేశానికి క్లాప్ నివ్వ‌గా, ప్ర‌ముఖ పాత్రికేయులు వినాయ‌క‌రావు,  నిర్మాత తుమ్మ‌ల‌ప‌ల్లి రామ స‌త్య‌నారాయ‌ణ స్క్రిప్ట్ అందించారు.

ఈ సందర్భంగా ప్రొడ్యూస‌ర్ కౌన్సిల్ సెక్ర‌ట‌రీ ప్ర‌స‌న్న కుమార్ మాట్లాడుతూ. ``సామాన్యుడికి మించిన ధైర్యం ఎవ‌రిలో ఉండ‌దు. అలాంటి అద్భుత‌మైన టైటిల్ తో ఈ సినిమా రూపొందిస్తోన్న ద‌ర్శ‌క నిర్మాత‌ల‌ను అభినందిస్తున్నాను. సామాన్యుడి పై వ‌చ్చిన చిత్రాల‌న్నీ గొప్ప విజ‌యాలు సాధించాయి.  ఆ కోవ‌లో ఈచిత్రం కూడా విజ‌యం సాధించాల‌ని కోరుకుంటున్నా’అన్నారు. 

నిర్మాత ర‌మ‌ణ కొటారి మాట్లాడుతూ...`ద‌ర్శ‌కుడు చెప్పిన క‌థ న‌చ్చి తొలి సారిగా సినిమా రంగంలోకి వ‌స్తూ  ‘సామాన్యుడి దైర్యం’ నిర్మిస్తునాను.ద‌ర్శ‌కుడు రామ్ బొత్స మంచి టాలెంట్ ఉన్న ద‌ర్శ‌కుడు. ఇలాంటి నూత‌న ద‌ర్శ‌కులను ఎంక‌రేజ్ చేయ‌డానికి నేను ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాను. మా `సామాన్యుడి దైర్యం` తెలుగు ప్రేక్ష‌కులు ఆద‌రిస్తార‌ని న‌మ్ముతున్నాను’అన్నారు

 ద‌ర్శ‌కుడు రామ్ బొత్స మాట్లాడుతూ...``మా నిర్మాత‌కు క‌థ న‌చ్చ‌డంతో ఈ సినిమా ప్రారంభించాం. సామాన్యుడి ధైర్యం ఎలా ఉంటుందో మా సినిమాలో చూపించ‌బోతున్నాం. కొత్త‌, పాత న‌టీన‌టుల‌తో ఈ సినిమా ఉంటుంది. ఇందులో యాక్ష‌న్, హాస్యం, సామాజిక అంశాలుంటాయి’ అన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో సీనియ‌ర్ ద‌ర్శ‌కుడు వి.సాగ‌ర్, వ‌డ్ల‌ప‌ట్ల మోహ‌న్ , ల‌య‌న్ సాయి వెంక‌ట్, భాస్క‌ర్ సాగ‌ర్ చిత్ర యూనిట్ పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement