టీడీపీ నేతలు ఓడిపోతున్నారు.. వేమిరెడ్డి ప్రశాంతి ఆడియో లీక్‌ | TDP Vemireddy Prashanthi Reddy Audio Leak Over Nellore Politics | Sakshi
Sakshi News home page

ఎన్నికల వేళ టీడీపీకి భారీ షాక్‌.. వేమిరెడ్డి ప్రశాంతి ఆడియో లీక్‌

Published Mon, Apr 8 2024 1:32 PM | Last Updated on Mon, Apr 8 2024 3:24 PM

TDP Vemireddy Prashanthi Reddy Audio Leak Over Nellore Politics - Sakshi

సాక్షి, నెల్లూరు: నెల్లూరు జిల్లాలో టీడీపీ నాయకురాలు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఆడియో సంచలనంగా మారింది. పలువురు టీడీపీ నేతలు ఓడిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ ఈ క్రమంలోనే వైఎస్సార్‌సీపీ నేతలను ప్రలోభాలకు గురిచేశారు. టీడీపీలో చేరితే మూడు కోట్లు ఇస్తామని ఆఫర్‌ ఇచ్చారు. 

కాగా, వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఇటీవల కొవ్వూరు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్‌ రెడ్డి సోదరుడు రాజేంద్రనాథ్‌ రెడ్డికి కాల్‌ చేశారు. ఈ కాల్‌ సందర్భంగా సంచలన విషయాలు బయటకు వచ్చాయి. ఈ కాల్‌లో ఆమె టీడీపీ నాయకులను కించపరుస్తూ మాట్లాడారు. అలాగే, ప్రసన్న కుమార్‌ రెడ్డి, రాజేంద్రనాథ్‌ రెడ్డిని విడగొట్టేందుకు పలు మార్లు రాజేంద్రనాథ్‌కు ఆమె కాల్‌ చేశారు. 

ఈ క్రమంలో రాజేంద్రనాథ్‌ను టీడీపీలో చేరాలని సూచించారు. టీడీపీలో చేరితో మూడు ఇస్తామని ఆఫర్‌ కూడా ఇచ్చారు. అలాగే, టీడీపీకి అభ్యర్థులు లేకపోవడంతో తనను కొవ్వూరు నుంచి పోటీ చేయాలని కోరుతున్నారని అన్నారు. పలు నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులు ఓడిపోతున్నారని ఆమె ఈ కాల్‌లో మాట్లాడారు. ఇదే సమయంలో తాము ఓడిపోతే ప్రజలను వదిలేసి వ్యాపారాలు చేసుకుంటామని చెప్పారు. ఆత్మకూరులో మేకపాటి విక్రమ్‌ భారీ మెజార్టీతో గెలవబోతున్నారని చెప్పుకొచ్చారు. 

అనంతరం, ప్రశాంతి రెడ్డి ఆడియోను రాజేంద్రనాథ్‌ రెడ్డి బయటపెట్టారు. ఈ నేపథ్యంలో తాజాగా రాజేంద్రనాథ్‌ మాట్లాడుతూ.. నా మద్దతు కోసం వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఫోన్‌ చేశారు. నల్లపురెడ్డి కుటంబంలో విభేదాలు తేవాలని చూస్తున్నారు. ప్రసన్న కుమార్‌ రెడ్డికి, నాకు మధ్య ఎలాంటి విభేదాలు లేదు. ప్రశాంతి రెడ్డి రెడ్డికి మా కుటుంబం పేరెత్తే అర్హత కూడా లేదన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement