
– బోయపాటి శ్రీను
‘‘చిన్న సినిమా.. పెద్ద సినిమా అని ఉండదు. మంచి సినిమానా? కాదా? అనేది ఉంటుంది. ‘దేవకి నందన వాసుదేవ’ వంద శాతం మంచి సినిమా అనిపించింది. ఈ చిత్రం అశోక్‌కి, అర్జున్‌కి అగ్ని పరీక్షే. ఈ పరీక్షని ఎదుర్కొని వారు నిలబడతారని కోరుకుంటున్నాను’’ అని డైరెక్టర్ బోయపాటి శ్రీను అన్నారు. అశోక్ గల్లా, వారణాసి మానస జంటగా నటించిన చిత్రం ‘దేవకి నందన వాసుదేవ’. అర్జున్ జంధ్యాల దర్శకుడు. నల్లపనేని యామిని సమర్పణలో సోమినేని బాలకృష్ణ నిర్మించిన ఈ సినిమా రేపు విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బోయపాటి శ్రీను, హీరో సుధీర్ బాబు అతిథులుగా పాల్గొన్నారు.
సుధీర్‌బాబు మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా ట్రైలర్, విజువల్స్, సాంగ్స్ చూసినప్పుడు అశోక్‌కి సరైన సినిమా అనిపించింది. తను కమర్షియల్ హీరోగా సక్సెస్ అవుతాడు’’ అన్నారు. ‘‘నేను రాసిన కథల్లో ఇది మాస్ ఎంటర్‌టైనర్. ఈ పాత్రకి అశోక్ కరెక్టుగా సరిపోయాడు. మహేశ్‌బాబుగారి ఫ్యాన్స్, ఆడియన్స్ ఈ చిత్రాన్ని చూసి, సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా’’ అని చిత్ర కథారచయిత ప్రశాంత్ వర్మ అన్నారు. ‘‘ఈ సినిమా నిర్మాణంలో ఎన్నో ఎత్తు పల్లాలు చూశాను. నాలాంటి కొత్త నిర్మాతని బతికించాలి’’ అని బాలకృష్ణ కోరారు.
Comments
Please login to add a commentAdd a comment