
‘‘దేవకి నందన వాసుదేవ’ సినిమా మంచి భావోద్వేగాలతో కూడిన యాక్షన్ ఎంటర్‌టైనర్. ధర్మం అంటే దేవుడు అనే మాట కూడా ఈ మూవీలో చాలా కీలకం. అలాగే పూర్తి వాణిజ్య అంశాలు ఉంటాయి. మా చిత్రం కుటుంబ ప్రేక్షకులకు అద్భుతంగా నచ్చుతుంది. అలాగే అన్ని వర్గాల ప్రేక్షకులు ఎంజాయ్ చేసేలా ఉంటుంది’’ అని డైరెక్టర్ అర్జున్ జంధ్యాల తెలిపారు. అశోక్ గల్లా, వారణాసి మానస జంటగా నటించిన చిత్రం ‘దేవకి నందన వాసుదేవ’. నల్లపనేని యామిని సమర్పణలో సోమినేని బాలకృష్ణ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 22న విడుదల కానుంది.
ఈ సందర్భంగా అర్జున్ జంధ్యాల విలేకరులతో మాట్లాడుతూ– ‘‘గుణ 369’ డైరక్టర్ ప్రశాంత్ వర్మగారికి నచ్చింది. ఆయన రాసిన ‘దేవకి నందన వాసుదేవ’ కథకు నేనైతే న్యాయం చేయగలనని భావించి, దర్శకత్వ బాధ్యతలను నాకు అప్పగించారు. ఫైనల్ సినిమా చూసి సర్‌ప్రైజ్ అయ్యారాయన. అశోక్ గల్లాగారు తన పాత్ర కోసం చాలా కష్టపడ్డారు. మానసది బలమైన పాత్ర. దేవ్ దత్తాగారు కంసరాజ్ పాత్రని అద్భుతంగా చేశారు.
సాయి మాధవ్ బుర్రాగారు సినిమాలోని భావోద్వేగాలు, కథకి తగ్గట్టుగా మాటలందించారు. నేపథ్య సంగీతం, మ్యూజిక్‌తో ఈ సినిమాకిప్రాణం పోశారు భీమ్స్. బాలకృష్ణగారు ఈ కథకి కావల్సినవన్నీ సమకూర్చి గ్రాండ్‌గా నిర్మించారు. హీరో మహేశ్‌బాబుగారికి మా సినిమా ట్రైలర్ బాగా నచ్చింది. ఆయన మా టీమ్‌ని అభినందిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు’’ అని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment