
శర్వానంద్ 'రన్ రాజా రన్' మూవీతో తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్‌గా పరిచయమైంది సీరత్ కపూర్.

టైగర్, కొలంబస్, రాజు గారి గది 2, టచ్ చేసి చూడు వంటి తెలుగు చిత్రాల్లో నటించింది.

ఓటీటీలో కృష్ణ అండ్ హిస్ లీల, మా వింత గాథ వినుమా చిత్రాలతో మెప్పించింది.

సేవ్ ద టైగర్స్ వెబ్ సిరీస్‌లోనూ కీలక పాత్రలో మెరిసింది.

ఒకప్పుడు హీరోయిన్‌గా నటించిన ఈ బ్యూటీ ఇటీవల వచ్చిన మనమే మూవీలో సైడ్ క్యారెక్టర్ చేసింది.

ఉషా పరిణయం మూవీలో ఘల్లు ఘల్లు.. అనే ఐటం సాంగ్‌లో ఆడిపాడింది.

ఈ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్‌లో సాయిధరమ్‌తేజ్.. సీరత్ డ్యాన్స్‌కు తాను పెద్ద ఫ్యాన్ అని చెప్పాడు.

ఆమె స్టెప్పులేస్తుంటే చూపు తిప్పుకోవడం కష్టమన్నాడు.

అలా మెగా హీరోను సైతం మురిపించిన ఈ బ్యూటీ.. మంచి ఛాన్సులు అందుకుని మళ్లీ ఓ వెలుగు వెలగాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.




