Union Minister Kishan Reddy Met Sai Dharam Tej Tweet Goes Viral - Sakshi
Sakshi News home page

Kishan Reddy Met Sai Dharam Tej: సాయిధరమ్‌ తేజ్‌ను పరామర్శించిన కేంద్ర మంత్రి

Published Sat, Jan 1 2022 6:35 PM | Last Updated on Sat, Jan 1 2022 7:00 PM

Union Minister Kishan Reddy Met Sai Dharam Tej - Sakshi

Union Minister Kishan Reddy Met Sai Dharam Tej: మెగా మేనల్లుడు, సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్‌ను కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌ రెడ్డి పరామర్శించారు. హైదరాబాద్‌లోని సాయిధరమ్‌ తేజ్‌ నివాసానికి వెళ్లి అతని ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు మంత్రి కిషన్‌  రెడ్డి. అనంతరం రోడ్డు ప్రమాదం, తదితర విషయాలపై చర్చించుకున్నట్లు సమాచారం. బిజీ షెడ్యూల్‌లో కూడా ఇంటికి వచ్చి తనను పలకరించినందుకు కిషన్‌ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపాడు సాయిధరమ్‌ తేజ్‌. ఈ విషయాన్ని తన ట్విటర్‌ ఖాతాలో షేర్‌ చేశాడు. 

రెండు నెలల క్రితం సాయిధరమ్‌ తేజ్‌ బైక్‌పై నుంచి కింద‌ప‌డి తీవ్రంగా గాయ‌ప‌డిన సంగతి తెలిసిందే. అప్ప‌టి నుంచి సుమారు 40 రోజుల‌కు పైగా అపోలో ఆస్ప‌త్రిలో చికిత్స పొందాడు. అనంతరం తన బర్త్‌డే రోజు డిశ్చార్జ్‌ అయిన సాయిధరమ్ తేజ్‌ ఇంటికి వచ్చాడు. ప్ర‌స్తుతం ఇంట్లోనే ఉంటూ విశ్రాంతి తీసుకుంటున్నాడు. అప్పటి నుంచి అనేక మంది సాయిధరమ్‌ తేజ్‌ను వచ్చి కలుస్తున్నారు. ఈ క్రమంలోనే మంత్రి కిషన్‌ రెడ్డి కూడా వచ్చి పరామర్శించారు. ఇటీవల సాయిధరమ్ తేజ్‌ తన ఫ్యాన్స్‌కు ఆడియో ద్వారా సందేశం పంపిన సంగతి తెలిసిందే. 


ఇదీ చదవండి: ఫ్యాన్స్‌కు సాయి ధరమ్‌ తేజ్‌ వాయిస్‌ మెసేజ్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement