
‘‘మా అమ్మ కోసం ‘విరూపాక్ష’ చేశాను. ఈ సినిమాకు వాయిస్ ఓవర్ ఇచ్చిన ఎన్టీఆర్‌కు థ్యాంక్స్. ఈ చిత్రానికి సుకుమార్‌గారు స్క్రీన్‌ప్లే అందించి, నిర్మాణ భాగస్వామిగా ఉండటం హ్యాపీ’’ అని హీరో సాయిధరమ్ తేజ్ అన్నారు. కార్తీక్ దండు దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న చిత్రానికి ‘విరూపాక్ష’ అనే టైటిల్ ఖరారు చేశారు. బాపినీడు .బి సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్‌ఎల్‌పీ, సుకుమార్ రైటింగ్స్‌పై బీవీఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా టైటిల్ గ్లింప్స్‌ను సాయిధరమ్ రిలీజ్ చేశారు.
ఎన్టీఆర్ వాయిస్ ఓవర్‌తో ఈ గ్లింప్స్ సాగుతుంది. ఈ చిత్రం తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో 2023 ఏప్రిల్ 21న రిలీజ్ కానుంది. విలేకరుల సమావేశంలో కార్తీక్ దండు మాట్లాడుతూ– ‘‘1990 నేపథ్యంలో ఫారెస్ట్ బేస్డ్ విలేజ్‌లో జరిగే థ్రిల్లర్ ఇది. అక్కడ జరిగే వింత పరిణామాలను హీరో ఎలా ఎదుర్కొన్నాడు? అనేది ఆసక్తిగా ఉంటుంది. ప్రమాదం నుంచి కోలుకున్నాక సాయిధరమ్ ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా మా సినిమా కోసం ఎంతో కష్ట పడ్డాడు’’ అన్నారు. ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు సతీష్ బీకేఆర్, అశోక్ బండ్రెడ్డి, సంగీత దర్శకుడు అజనీష్ లోక్‌నాథ్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment