మెగా హీరో సాయిధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదానికి గురైనప్పుడు ఆయన్ను గుర్తించి వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లేలా చేసిన వ్యక్తి అబ్దుల్ ఫర్హాన్. సకాలంలో తేజ్‌కు చికిత్స అందేలా చేసిన అతడికి మెగా ఫ్యామిలీ లక్షల రూపాయలు, కారు, బైకు, బంగ్లా బహుమతిగా ఇచ్చిందంటూ ఆ మధ్య ఎన్నో వార్తలు వచ్చాయి. అయితే అదేమీ లేదని, ఎలాంటి రివార్డు ఇవ్వలేదని ఇటీవల సాయిధరమ తేజ్ స్వయంగా క్లారిటీ ఇచ్చాడు. ఏదో ఒక లక్ష రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకోవడం తనకు ఇష్టం లేదని, అందుకే ఏ రివార్డు ఇవ్వలేదని చెప్పాడు. కానీ తన ఫోన్ నెంబర్ ఇచ్చానని.. ఎప్పుడు ఏ అవసరం వచ్చినా కాల్ చేయమని చెప్పినట్లు వెల్లడించాడు.
తాజాగా ఈ వ్యాఖ్యలపై అబ్దుల్ స్పందిస్తూ తన పరిస్థితిని వివరించాడు. 'సాయిధరమ్ తేజ్‌ను కాపాడిన తర్వాత నన్ను ఎవరూ కలవలేదు. తేజ్ కానీ, ఆయన కుటుంబ సభ్యులు కానీ ఎవరూ కలవలేదు. తేజ్ నన్ను కలిసి ఫోన్ నెంబర్ ఇచ్చినట్లు వస్తున్న వార్తలన్నీ అబద్ధాలే! నాకు మెగా ఫ్యామిలీ సాయం చేసిందంటూ వచ్చిన ఫేక్ న్యూస్ వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను. మొదట ఒక షాపులో పని చేసేవాడిని.
కానీ మెగా ఫ్యామిలీ నాకు రివార్డు ఇచ్చిందంటూ ప్రచారం జరగడంతో మా కొలీగ్స్, బంధువులు అందరూ.. ఇంకే.. బాగా డబ్బు ఇచ్చారట.. బిల్డింగ్ ఇచ్చారట.. జాక్‌పాట్ కొట్టావ్ అని టార్చర్ పెట్టారు. అది భరించలేక అక్కడ ఉద్యోగం మానేశా. తర్వాత నాలుగైదు నెలలు ఖాళీగా ఉన్నా. నాకు ఎవరి నుంచి ఏ సాయం అందలేదు, ఎవరి నుంచీ ఫోన్ రాలేదు, ఎవరూ ప్రత్యేకంగా ఫోన్ నెంబర్ ఇవ్వలేదు. అయినా ఇప్పటికీ నా గురించి ఫేక్ ప్రచారం జరుగుతూనే ఉంది, దీనివల్ల ఇప్పటికే నేను సమస్యలు ఎదుర్కొంటున్నాను. దయచేసి ఈ ప్రచారాన్ని ఆపేయండి' అని ఆవేదన వ్యక్తం చేశాడు అబ్దుల్ ఫర్హాన్.
చదవండి: ఓటీటీలోకి వచ్చిన దసరా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే
విశ్వక్ సేన్ కొత్త సినిమా.. ఈసారి రాజమండ్రిలో జరిగిన కథ ఆధారంగా..
Comments
Please login to add a commentAdd a comment