‘‘విరూక్ష’ మిస్టిక్ థ్రిల్లర్‌గా రూపొందింది. హారర్ మూవీ కాదు. కానీ ప్రేక్షకులు భయపడతారు. 1990ల నాటి కాలంలో ఈ మూవీ కథ జరుగుతుంది’’ అన్నారు సంయుక్తా మీనన్. సాయిధరమ్ తేజ్ హీరోగా కార్తీక్ దండు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘విరూపాక్ష’. బాపినీడు .బి సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్‌ఎల్‌పీ, సుకుమార్ రైటింగ్స్‌పై బీవీఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 21న రిలీజ్ కానుంది.
ఈ సందర్భంగా చిత్ర కథానాయిక సంయుక్తా మీనన్ మాట్లాడుతూ– ‘‘బింబిసార’ తర్వాత నేను సంతకం చేసిన రెండో చిత్రం ‘విరూపాక్ష’. అయితే కరోనా లాక్‌డౌన్, తేజ్‌కి ప్రమాదం.. వంటి కారణాలతో ఈ సినిమా లేట్ అయింది. ‘విరూపాక్ష’ తర్వాత నేను ఒప్పుకున్న ‘వకీల్ సాబ్, సార్’ సినిమాలు ముందు రిలీజ్ అయ్యాయి. రుద్రవనం అనే గ్రామంలో జరిగే కథే ‘విరూపాక్ష’. నేను నందిని అనే పల్లెటూరి అమ్మాయి పాత్ర చేశాను. నందినికి పొగరు, పట్టుదల ఎక్కువ ఉంటుంది. నందిని పాత్రకి, నిజ జీవితంలో నా క్యారెక్టర్‌కి పోలికే లేదు. బైక్ ప్రమాదం నుంచి కోలుకున్నాక తేజ్ గారు ఎంతో ఎనర్జీతో ఈ మూవీ చేశారు. నాకు కామెడీ రోల్స్ ఇష్టం.. అవి చేయాలనుంది. ప్రస్తుతం కల్యాణ్ రామ్‌గారితో ‘డెవిల్’ చిత్రం చేస్తున్నా’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment