Sai Dharam Tej Going To Take Six Month Break from Movies, Know Reason Inside - Sakshi
Sakshi News home page

Sai Dharam Tej Taking Break: మెగా హీరో సంచలన నిర్ణయం.. 6 నెలలు సినిమాలకు బ్రేక్‌, స్టెరాయిడ్స్‌ వల్లే!

Published Wed, Jul 19 2023 10:47 AM | Last Updated on Wed, Jul 19 2023 11:55 AM

Sai Dharam Tej Going to Take Six Month Break from Movies - Sakshi

మెగా హీరో సాయిధరమ్‌ తేజ్‌ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. సినిమాల నుంచి ఆరు నెలలపాటు బ్రేక్‌ తీసుకున్నట్లు ప్రకటించాడు. ప్రస్తుతం తేజ్‌, పవన్‌ కల్యాణ్‌ బ్రో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే! ఈ సినిమాలో ఇటీవల రిలీజైన ఓ పాటపై విమర్శలు వ్యక్తమయ్యాయి. పాట ట్యూన్‌ బాలేదంటే సాయిధరమ్‌ తేజ్‌ స్టెప్పులు అంతకన్నా బాలేవని నెటిజన్లు పెదవి విరిచారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మెగా హీరో సాయిధరమ్‌ తేజ్‌ ఈ ట్రోలింగ్‌పై స్పందించాడు. తన ఆరోగ్యం సహకరించకపోవడం వల్లే గ్రేస్‌తో డ్యాన్స్‌ చేయలేకపోతున్నానని వెల్లడించాడు.

ఆయన మాట్లాడుతూ.. 'బ్రో సినిమాలోని పాటలకు సరిగ్గా డ్యాన్స్‌ కూడా చేయలేకపోయాను. అంతకుముందు రోడ్డు ప్రమాదంలో జరిగిన గాయం వల్ల ఎనర్జీతో స్టెప్పులేయకపోతున్నాను. గాయం నుంచి కాస్త కోలుకున్నప్పటికీ కొంత ఇబ్బంది పడుతున్నాను. దెబ్బ తగిలితే ఆగిపోకూడదు. ఏదేమైనా మందుకు సాగాలని నిర్ణయించుకున్నాను. కానీ ఆ యాక్సిడెంట్‌ అయినప్పటి నుంచి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాను. డ్యాన్స్‌ దగ్గరి నుంచి మాట్లాడటం వరకు తడబడుతున్నాను. బ్రో సినిమాలోని పాటలో నా డ్యాన్స్‌ చూసి ప్రజలే కాదు నేను కూడా నిరాశచెందాను. నేను సరిగా చేయలేకపోతున్నానని బాధపడ్డాను.

నిజానికి నేను కోమాలో ఉన్నప్పుడు స్టెరాయిడ్స్‌ ఇచ్చారు. దానివల్ల చాలా బరువు తగ్గాను. ఫిట్‌నెస్‌ కూడా కోల్పోయాను. అకస్మాత్తుగా స్టెరాయిడ్స్‌ మానేయడం, వర్కవుట్స్‌ చేయకపోవడం వల్ల మళ్లీ బరువు పెరిగాను. ఇప్పుడు నేను బరువు తగ్గి ఫిట్‌నెస్‌పై దృష్టిపెట్టాలని ఆలోచిస్తున్నాను. బ్రో తర్వాత సినిమాలకు విరామం ఇద్దామనుకుంటున్నా. ఒక చిన్న సర్జరీ ఉంది. దాన్నుంచి కోలుకోవడానికి దాదాపు ఆరు నెలలు సమయం పడుతుంది. ఆ తర్వాతే సంపత్‌ నందితో సినిమా చేస్తాను' అని చెప్పుకొచ్చాడు సాయిధరమ్‌ తేజ్‌.

చదవండి: జీవిత రాజశేఖర్‌కు ఏడాది జైలు శిక్ష
బాలీవుడ్‌ ఎంట్రీకి కీర్తి సురేశ్‌ రెడీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement