నేను మీ వాడినే, ఇక్కడే చదువుకున్నా: సాయిధరమ్‌ తేజ్‌ | Sai Dharam Tej Virupaksha Gears up Tamil release | Sakshi
Sakshi News home page

తమిళంలో రిలీజ్‌ కానున్న విరూపాక్ష, డైరెక్ట్‌ తమిళ మూవీ చేయాలనుందన్న తేజ్‌

Published Sun, Apr 30 2023 6:51 AM | Last Updated on Sun, Apr 30 2023 6:51 AM

Sai Dharam Tej Virupaksha Gears up Tamil release - Sakshi

తాను మీ వాడినేనని నటుడు సాయి ధరమ్‌ తేజ్‌ చెన్నైలో పేర్కొన్నారు. ఈయన కథా నాయకుడిగా నటించిన తాజా చిత్రం విరూపాక్ష. బి. బాపినీడు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బీవీఎస్ ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రానికి దర్శకుడు సుకుమార్ స్క్రీన్ ప్లే అందించారు. కార్తీక్ వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సంయుక్త కథానాయికగా నటించింది. గత వారం తెలుగులో విడుదలైన ఈ సినిమా సూపర్‌ హిట్‌గా నిలిచి ఇప్పటికీ విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. 

ఇప్పుడు ఈ చిత్రం తమిళ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తమిళంలో దీనిని స్టూడియో గ్రీన్ ఫిలిమ్స్ పతాకంపై కేఈ జ్ఞానపీవల్ రాజా తమిళనాడులో మే 5న విడుదల చేయనున్నారు. శక్తి ఫిలింస్ ఈ చిత్రాన్ని డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు. ఈ సందర్భంగా విరూపాక్ష చిత్ర యూనిట్ శుక్రవారం మధ్యాహ్నం చెన్నైలో మీడియాతో సమావేశం అయ్యారు. నిర్మాత ప్రసాద్ మాట్లాడుతూ.. తాను 35 ఏళ్లుగా తమిళంలో చిత్రం చేయాలని ప్రయత్నిస్తున్నానని, దర్శకుడు ఎస్.పి.ముత్తురామన్ దర్శకత్వంలోనే చిత్రం చేయాలని భావించానన్నారు.

ఆ తరువాత అగస్త్రియన్ దర్శకత్వంలో చేసే ప్రయత్నం చేసినా కుదరలేదన్నారు. అలాంటివి విరూపాక్ష చిత్రంతో కోలీవుడ్‌కు రావడం సంతోషంగా ఉందని అన్నారు. చిత్ర కథానాయకుడు సాయి ధరమ్ తేజ్ మాట్లాడుతూ.. తాను మీ వాడినేనని టీ నగర్‌లో చదువుకున్నానని చెప్పారు. విరూపాక్ష చిత్రాన్ని కష్టపడి చేశామని తెలుగులో మంచి విజయం సాధించిందని చెప్పారు. చిత్రంలో అన్ని అంశాలు ఉంటాయని, మీ ఆదరణ కావాలని కోరారు. తమిళంలో చిత్రం చేయాలని చాలా కాలంగా కోరుకుంటున్నానని, అవకాశం వస్తే నేరుగా తమిళ చిత్రం చేయడానికి సిద్ధం అని సాయిధరమ్‌ తేజ్‌ పేర్కొన్నారు.

చదవండి: ప్రియురాలితో నటుడి సహజీవనం, పెళ్లికాకుండానే రెండోసారి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement