Allu Aravind's Emotional Words About Sai Dharam Tej Accident Incident - Sakshi
Sakshi News home page

రక్తం చుక్క కూడా రాలేదు.. చాలా భయపడ్డా: అల్లు అరవింద్‌

Published Tue, Apr 11 2023 4:32 PM | Last Updated on Tue, Apr 11 2023 5:00 PM

Allu Aravind Talk About Sai Dharam Tej Accident Incident At Virupaksha Trailer Release Event - Sakshi

మెగా మేనల్లుడు సాయి ధరమ్‌ తేజ్‌ గతంలో బైక్‌ ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఆ ప్రమాదం నుంచి పూర్తిగా కోలుకున్న తేజ్‌..ఇప్పుడు వరుసగా సినిమాలు చేస్తున్నాడు. తాజాగా తేజ్‌ నటించిన చిత్రం ‘విరూపాక్ష’ విడుదలకు సిద్ధంగా ఉంది. నేడు ఈ సినిమా ట్రైలర్‌ విడుదలైంది. ట్రైలర్‌ ఈవెంట్‌కి ముఖ్య అతిథిగా వచ్చిన అల్లు అరవింద్‌ .. తేజ్‌ ప్రమాదం గురించి మాట్లాడారు.

‘తేజ్‌కు యాక్సిడెంట్‌ అయిందనే విషయం తెలియగానే.. మొదట నేనే ప్రమాదం జరిగిన స్థలానికి వెళ్లాను. సాయి ధరమ్‌ తేజ్‌ పరిస్థితి చూసి చాలా భయమేసింది. రక్తం చుక్క కూడా రాలేదు. ఏం జరిగిందో తెలియడానికి పావు గంట పట్టింది. అంత పెద్ద ప్రమాదం నుంచి బయటపడినందుకు చాలా ఆనందంగా ఉంది. బ్రతుకుతాడో లేదో అనుకున్న వ్యక్తి.. ఇప్పుడు ‘విరూపాక్ష’లో అద్భుతంగా నటించాడని కొంతమంది చెబుతుంటే సంతోషంగా ఉంది’అని అల్లు అరవింద్‌ అన్నారు. కార్తీక్‌దండు దర్శకత్వంలో తెరకెక్కిన ‘విరూపాక్ష’లో సంయుక్త మీనన్‌ హీరోయిన్‌గా నటించింది. ఈ నెల 21న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement