Sai Dharam Tej's Virupaksha Trailer Will Be Out On This Date - Sakshi
Sakshi News home page

Sai Dharam Tej : మీ అంచనాలను మించి ఉంటుంది.. 'విరూపాక్ష' ట్రైలర్‌పై అప్‌డేట్‌

Published Mon, Apr 10 2023 2:39 PM | Last Updated on Mon, Apr 10 2023 3:05 PM

Sai Dharam Tej Virupaksha Trailer Will Be Out On This Date - Sakshi

సాయి ధరమ్‌ తేజ్, సంయుక్తా మీనన్‌ జంటగా నటిస్తున్న చిత్రం విరూపాక్ష. SDT15 ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ఈ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్, టీజర్‌ ఆడియెన్స్‌ను బాగా అట్రాక్ట్‌ చేస్తున్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించి క్రేజీ న్యూస్‌ తెరమీదకి వచ్చింది.

ప్రేక్షకులను మరింత థ్రిల్‌కి గురిచేసేందుకు రేపు (ఏప్రిల్ 11) ఉదయం 11:07 నిమిషాలకు ట్రైలర్‌ను రిలీజ్‌ చేస్తున్నాం అంటూ మేకర్స్‌ తెలిపారు. ఇది ప్రేక్షకుల అంచనాలను మించి ఉంటుందంటూ సాయితేజ్‌ సైతం ట్వీట్‌ చేశారు. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ వెన్యూను కూడా ఫిక్స్‌ చేశారు. ఈనెల 16న ఏలూరు సీఆర్‌ రెడ్డి కాలేజీలో ఈ మూవీ ప్రీ రిలీజ్‌ను గ్రాండ్‌గా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.  


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement