Sai Dharam Tej Voice Message To His Fans: మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ రెండు నెలల క్రితం బైక్‌పై నుంచి కిందపడి తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి దాదాపు 40 రోజులకు పైగా అపోలో ఆస్పత్రిలో చికిత్స సాయి తన బర్త్‌డే రోజు డిశ్చార్జ్ అయిన ఇంటికి వచ్చాడు. ప్రస్తుతం ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఈ క్రమంలో ఫ్యాన్స్‌కు ఆడియో ద్వారా సందేశం ఇచ్చాడు. కాగా ఇటీవల తను నటించిన రిపబ్లిక్ మూవీ రేపు(నవంబర్ 26) ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది.
చదవండి: షాకింగ్ లుక్‌లో సహజనటి జయసుధ.. ఇంతగా మారిపోయారేంటి?
చదవండి: Disha Patani: అందరి ముందు టెబుల్ ఎక్కి మరి డ్యాన్స్ చేసిన దిశా అక్క ఖుష్బూ పటానీ
ఈ నేపథ్యంలో అభిమానులకు వాయిస్ మెసెజ్ ఇస్తూ.. ‘నేను మీ సాయిధరమ్ తేజ్.. మీరు నా మీద చూపించిన ప్రేమకు ఎప్పుడు రుణపడి ఉంటాను.. నా ఆరోగ్యంపై మీరు చూపించిన శ్రద్ధ ఎప్పటికీ మర్చిపోలేను. రిపబ్లిక్ సినిమాను మీతో కలిసి చూడలేకపోయాను. కానీ ఇప్పుడు నవంబర్ 26న ఈ సినిమా జీ5లో విడుదల అవుతుంది. సినిమా చూసి మీ అభిప్రాయాలు నాకు తెలపండి’ అంటూ వాయిస్ మెసేజ్ పంపించాడు సాయి ధరమ్ తేజ్. ప్రస్తుతం ఈ మెసేజ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దేవా కట్టా తెరకెక్కించిన ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్‌కు జోడిగా ఐశ్వర్య రాజేశ్ నటించింది. అక్టోబర్ 1న విడుదలైన ఈ చిత్రంలో సీనియర్ నటి రమ్యకృష్ణ కీలక పాత్ర పోషించారు.
చదవండి: ప్రముఖ కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ ఆరోగ్యం విషమం
Comments
Please login to add a commentAdd a comment