Virupaksha movie teaser release postponed due to fan death - Sakshi
Sakshi News home page

Virupaksha Movie: ఫ్యాన్స్‌ ప్రెసిడెంట్‌ మృతి.. విరూపాక్ష టీజర్‌ రిలీజ్‌ వాయిదా

Published Wed, Mar 1 2023 12:26 PM | Last Updated on Wed, Mar 1 2023 1:27 PM

Virupaksha Movie Teaser Release Postponed due to Fan Death - Sakshi

భీమవరం సాయిధరమ్‌ తేజ్‌ ఫ్యాన్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు రావూరి పండు మరణంపై విచారం వ్యక్తం చేస్తున్నాం. ఆయన

యంగ్‌ హీరో సాయిధరమ్‌ తేజ్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం విరూపాక్ష. సంయుక్త మీనన్‌ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాకు కార్తీక్‌ వర్మ దర్శకత్వం వహిస్తున్నాడు. నేడు( మార్చి 1) విరూపాక్ష టీజర్‌ రిలీజ్‌ కానున్నట్లు చిత్రయూనిట్‌ అప్‌డేట్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే! కానీ సాయిధరమ్‌తేజ్‌ వీరాభిమాని మృతి చెందడంతో టీజర్‌ రిలీజ్‌ను వాయిదా పడింది. ఈ విషయాన్ని చిత్రయూనిట్‌ సోషల్‌ మీడియాలో వెల్లడించింది.

'భీమవరం సాయిధరమ్‌ తేజ్‌ ఫ్యాన్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు రావూరి పండు మరణంపై విచారం వ్యక్తం చేస్తున్నాం. ఆయన మృతికి నివాళులు అర్పిస్తూ విరూపాక్ష టీజర్‌ విడుదలను వాయిస్తున్నాం' అని తెలిపింది. ఇక ఈ సినిమా విషయానికి వస్తే.. బాపినీడు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినీచిత్ర ఎల్‌ఎల్‌పీ, సుకుమార్‌ రైటింగ్స్‌పై బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మించారు. డైరెక్టర్‌ సుకుమార్‌ స్క్రీన్‌ప్లే అందించి నిర్మాణ భాగస్వామిగా ఉన్నారు. ఇదివరకే రిలీజైన గ్లింప్స్‌కు మంచి స్పందన లభించింది.

చదవండి: ఇండియన్‌ 2లో విలన్‌గా వెన్నెల కిశోర్‌, ఇదిగో క్లారిటీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement