విరూపాక్ష హిట్‌.. ఇది నాకు సవాల్‌ లాంటిది: దిల్‌ రాజు | Sai Dharam Tej, Dil Raju Comments on Virupaksha Success Meet | Sakshi
Sakshi News home page

విరూపాక్ష హిట్‌.. ఇది నాకు సవాల్‌ లాంటిది: దిల్‌ రాజు

Published Mon, May 1 2023 7:41 AM | Last Updated on Mon, May 1 2023 7:41 AM

Sai Dharam Tej, Dil Raju Comments on Virupaksha Success Meet - Sakshi

ఇది నాకు సవాల్‌ లాంటిదే. తనతో నేను సినిమా తీస్తే విరూపాక్ష కంటే ఇంకా పెద్ద సినిమాను, దాన్ని మించి హిట్‌ కొట్టే మూవీ తీయాలి అని నిర్మాత దిల్‌ రాజు అన్నారు. సాయిధ

సాయిధరమ్‌తో నేను మూడు సినిమాలు తీశాను. తన కెరీర్‌లో విరూపాక్ష హయ్యస్ట్‌ గ్రాసర్‌గా నిలిచింది. ఇది నాకు సవాల్‌ లాంటిదే. తనతో నేను సినిమా తీస్తే విరూపాక్ష కంటే ఇంకా పెద్ద సినిమాను, దాన్ని మించి హిట్‌ కొట్టే మూవీ తీయాలి అని నిర్మాత దిల్‌ రాజు అన్నారు. సాయిధరమ్‌ తేజ్‌, సంయుక్తా మీనన్ జంటగా కార్తీక్ దండు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'విరూపాక్ష'. బాపినీడు బి. సమర్పణలో శ్రీ శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్‌పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా ఏప్రిల్ 21న విడుదలై, హిట్‌గాగా నిలిచింది.

ఈ సందర్భంగా నిర్వహించిన థ్యాంక్స్ మీట్‌లో సాయిధరమ్ తేజ్ మాట్లాడుతూ.. 'విరూపాక్షని హిట్ చేసిన ప్రేక్షకులకు థ్యాంక్స్. ఆ మాట చెప్పడంలో ఆనందం ఉంది. ఈ సినిమాను  ఈ నెల 5న హిందీ, తమిక్, మలయాళ భాషల్లో రిలీజ్ చేస్తున్నాం. అలాగే మే 12న కన్నడలో విడుదల చేస్తున్నాం' అన్నారు. "మా బ్యానర్‌కి విరూపాక్ష లాంటి పెద్ద సక్సెస్ ఇచ్చిన మా టీమ్‌కు, ప్రేక్షకులకు థ్యాంక్స్" అన్నారు బీవీఎస్ఎన్ ప్రసాద్, బాపినీడు. బి.

"విరూపాక్ష"ని మళ్లీ మళ్లీ చూసి మమ్మల్ని ప్రోత్సహిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు" అన్నారు కార్తీక్ దండు. "విరూపాక్ష ఇతర భాషల్లోనూ అద్భుతాలు సృష్టిస్తుందని భావిస్తున్నాం" అని సంయుక్తా మీనన్ అన్నారు. ఈ కార్యక్రమంలో సినిమాటో గ్రాఫర్ శ్యామ్ దత్, చిత్ర నటీనటులు, సాంకేతిక నిపుణులు, విరూపాక్ష మూవీ పంపిణీదారులు పాల్గొన్నారు.

చదవండి: అఖిల్‌ కొత్త సినిమా.. హీరోయిన్‌గా జాన్వీ!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement