టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్‌లో టాలీవుడ్ యంగ్ హీరో, మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ఒకరు. ఆయన పెళ్లి గురించి గతంలో అనేకసార్లు రూమర్స్ వచ్చాయి. అయితే సాయి తేజ్ మాత్రం వాటన్నింటిని కొట్టేస్తూ.. ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచన లేదని చెప్పుకొచ్చాడు. యాక్సిడెంట్ నుంచి కోలుకున్న తర్వాత సినిమాలపై ఫోకస్ పెట్టాడు.
ఆయన నటించిన తాజా చిత్రం విరూపాక్ష ఈ నెల 21న విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో వరుస ఇంటర్వ్యూలు, ప్రెస్‌మీట్స్‌లో పాల్గొంటున్నాడు. సినిమా ప్రచారం కోసం పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో తన పెళ్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఎవరో అంటున్నారు కదా అని తాను పెళ్లి చేసుకోనని, తనకు నచ్చినప్పుడే చేసుకుంటానని చెప్పాడు. అలాగే తన లవ్‌స్టోరీ గురించి కూడా చెప్పాడు. గతంలో ఓ అమ్మాయిని ప్రేమించానని.. కొన్ని కారణాల వల్ల బ్రేకప్ అయిందని చెప్పుకొచ్చాడు. బ్రేకప్ తర్వాత చాలా సైలెంట్ అయిపోయానని, అమ్మాయిలంటేనే భయమేస్తుందని తేజ్ అన్నారు.
ఇక విరూపాక్ష విషయానికొస్తే.. సుకుమార్ శిష్యుడు కార్తీక్ దండు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సస్పెన్స్ థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సంయుక్తా మీనన్ హీరోయిన్. బాపినీడు సమర్పణలో బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రానికి స్టార్ డైరెక్టర్ సుకుమార్ స్క్రీన్‌ప్లే అందించటం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment