Manchu Manoj Hosts A Party To Friend At His New House, Pics Viral - Sakshi
Sakshi News home page

Manchu Manoj : మంచు మనోజ్‌ కొత్తింట్లో సాయిధరమ్‌ తేజ్‌కు పార్టీ

Published Fri, May 12 2023 9:17 AM | Last Updated on Fri, May 12 2023 9:47 AM

Manchu Manoj Hosted Party For Sai Dharam Tej At His House - Sakshi

హీరో మంచు మనోజ్‌కు టాలీవుడ్‌లో చాలామంది ఫ్రెండ్స్‌ ఉన్నారు. వారిలో మెగా మేనల్లుడు సాయిధరమ్‌ తేజ్‌ కూడా ఒకరు. అతనితో మనోజ్‌ చాలా సన్నిహితంగా ఉంటాడన్న సంగతి తెలిసిందే. తాజాగా మనోజ్‌ కొత్తింట్లో సాయిధరమ్‌ తేజ్‌, నరేష్‌ కొడుకు నవీన్‌విజయ్‌ కృష్ణ సహా పలువురు స్నేహితులు సందడి చేశారు.

స్వయంగా బిర్యానీ వండుకొని నైట్‌ పార్టీని ఎంజాయ్‌ చేశారు. దీనికి సంబంధించిన ఫోటోను స్వయంగా మనోజ్‌ తన ఇన్‌స్టా వేదికగా షేర్‌ చేశాడు. రీసెంట్‌గా విరూపాక్షతో బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ అందుకున్న సాయితేజ్‌కు మరోసారి అభినందనలు తెలిపాడు.

చదవండి:  సమంత బోల్డ్‌ సీన్స్‌ వల్లే విడాకులా? క్లారిటీ ఇచ్చిన నాగచైతన్య

లవ్‌ యూ బ్రదర్స్‌ అంటూ మనోజ్‌ షేర్‌ చేసిన ఈ పిక్‌ నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఇక సినిమాల విషయానికి వస్తే.. ఇటీవలే వాట్ ది ఫిష్ (What the Fish) అనే ఓ కొత్త సినిమాను మనోజ్‌ అనౌన్స్‌ చేసిన సంగతి తెలిసిందే. దీంతో పాటు మరో రెండు సినిమాలు లైన్‌లో ఉన్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement