Sai Dharam Tej Reveals His Love Story With Thikka Heroine - Sakshi
Sakshi News home page

Sai DharamTej: ఆ హీరోయిన్‌కి ప్రపోజ్‌ చేశా.. ఆమె ఇచ్చిన రిప్లైకి నా హార్ట్ బ్రేక్ అయింది

Published Thu, Apr 20 2023 11:51 AM | Last Updated on Thu, Apr 20 2023 12:06 PM

Sai Dharam Tej Reveal His Love Story With Heroine - Sakshi

ఏ విషయంలోనైనా చాలా ఓపెన్‌గా ఉంటాడు మెగా మేనల్లుడు సాయిధరమ్‌ తేజ్‌. తన సినిమా వివరాలతో పాటు వ్యక్తిగత విషయాలను కూడా అందరితో పంచుకుంటాడు. ఇక యాక్సిడెంట్‌ సాయిధరమ్‌ ప్రవర్తనలో చాలా మార్పులు వచ్చాయి. ఉన్నది ఒక్కటే జీవితం.. నవ్వుతూ..నవ్విస్తూ బతకాలని డిసైడ్‌ అయ్యారు. ప్రెస్‌ మీట్స్‌, ఇంటర్వ్వూలోనూ ఇదే విషయాన్ని ఆయన చెబుతున్నారు. జీవితం అంటే కష్టాలు వస్తాయని అని వాటిని ఎదుర్కొని ముందుకు వెళ్లాలని అంటున్నాడు.

ఇక తన పెళ్లి విషయంలోనూ చాలా క్లారిటీతో ఉన్నాడు. ఇప్పట్లో పెళ్లి ఆలోచన లేదని, మంచి అమ్మాయి కనిపిస్తే తప్పకుండా చేసుకుంటానని చెబుతున్నాడు. అలాగే గతంలో ఓ అమ్మాయితో బ్రేకప్‌ అయిన విషయం కూడా చెప్పాడు. ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన క్రష్ గురించి, తాను ఇష్టపడ్డ అమ్మాయిల గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

(చదవండి: 36 ఏళ్ల వయసులో మళ్లీ మాటలు నేర్పించారు..అమ్మ తర్వాతే ఎవరైనా: సాయి తేజ్‌)

‘ప్రతి ఒక్క రియల్ లైఫ్ లోనూ ఎవరో ఒకరైనా క్రష్ ఉంటారు. నా లైఫ్ లోనూ ఒకరున్నారు. ఒక నటిగా, మనిషిగా అట్రాక్ట్ చేసింది సమంత. రెజీనా, సయామి అంటే కూడా చాలా ఇష్టం. ఎందుకంటే వాళ్లు నా ఫస్ట్‌ హీరోయిన్స్‌. ఇక నా లవ్‌స్టోరీ విషయానికొస్తే.. ఇంటర్‌లో ఉన్నప్పుడు  నా బెస్ట్‌ఫ్రెండ్‌ అయిన ఓ అమ్మాయిని ప్రేమించా. మొదట్లో మేమిద్దరం ప్రాణ స్నేహితులం. కానీ ఆ తర్వాత ప్రేమించుకున్నాం. కట్‌ చేస్తే.. డిగ్రీలో నేనే దగ్గరుండి ఆమెకు పెళ్లి చేశా. ఎందుకంటే అప్పటికీ నా దగ్గర డిగ్రీ పట్టా తప్ప ఏమీ లేదు. అందుకే నా ప్రేమను త్యాగం చేశా(నవ్వూతూ...).

ఇక సినిమాల్లోకి వచ్చాక.. .. 'తిక్క' సినిమా హీరోయిన్ లారిస్సా బోనేసి చూసి తొలిచూపులోనే ప్రేమలో పడ్డాను. సాంగ్‌ షూటింగ్‌ సమయంలోనే ఆమెకు ప్రపోజ్‌చేశా. ‘నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఒప్పుకుంటే డేటింగ్‌ చేద్దాం’అని డైరెక్ట్‌గా అడిగేశా.  కానీ ఆమె ఇచ్చిన రిప్లైకి నా హార్ట్ బ్రేక్ అయింది. సారీ తేజ్‌.. నాకు ఆల్రెడీ బాయ్‌ఫ్రెండ్‌ ఉన్నాడని చెప్పింది. బాధతో వెళ్లిపోయా. ప్రస్తుతం ‘సోలో బ్రతుకే సో బెటర్‌’ అన్నట్లు బ్రతుకుతున్నా. ఎప్పుడు రాసి పెట్టి ఉంటే అప్పుడు పెళ్లి అవుతుంది’ అని సాయిధరమ్‌ తేజ్‌ చెప్పుకొచ్చారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement