REPUBLIC: జనం ఆశించింది దొరికితే.. సాయ్‌ ధరమ్‌ తేజ్‌ ఎమోషనల్‌ పోస్ట్‌ | Block buster Republic movie:Hero Sai DharamTej emotional post | Sakshi
Sakshi News home page

REPUBLIC: జనం ఆశించింది దొరికితే.. సాయ్‌ ధరమ్‌ తేజ్‌ ఎమోషనల్‌ పోస్ట్‌

Published Sat, Dec 4 2021 4:53 PM | Last Updated on Sat, Dec 4 2021 5:17 PM

Block buster Republic movie:Hero Sai DharamTej emotional post - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: దేవా కట్టా దర్శకత్వంలో వచ్చిన రిపబ్లిక్‌ మూవీ హిట్‌ టాక్‌తో దూసుకుపోతోంది. ఈ ఘన విజయంపై హీరో సాయి ధరమ్‌ తేజ్‌ సోషల్‌ మీడియాలో స్పందించారు. తాము ఆశించింది దొరికితే ప్రజానీకం స్పందన ఎలా ఉంటుందో చెప్పిన  చిత్రం రిపబ్లిక్‌ అంటూ శనివారం ట్వీట్‌ చేశారు. తమ మూవీకి లభిస్తున్న ఆదరణకు, వస్తున్న ఫీడ్‌బ్యాక్‌కు ధన్యవాదాలు  తెలిపారు.  బ్లాక్‌ బస్టర్‌ రిపబ్లిక్‌ మూవీ ఏడురోజుల్లోనే 12 కోట్ల వ్యూయింగ్‌ మినిట్స్‌ అంటూ ఒక పోస్టర్‌ను షేర్‌ చేశారు.

జేబీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై జె. భగవాన్, జె. పుల్లారావు నిర్మించిన ఈ మూవీలో సాయి ధరమ్ తేజ్ లీడ్‌ రోల్‌ పోషించారు. ఇంకా ఐశ్వర్య రాజేష్, జగపతిబాబు, రమ్యకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు సంగీతం మణిశర్మ అందించారు. థియేటర్లలో ఈ ఏడాది అక్టోబరులో విడుదలైన  ‘రిపబ్లిక్’ మూవీ నవంబర్ 26న ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకు విశేష స్పందన లభిస్తోన్న సంగతి  తెలిసిందే. అటు అభిమానులు, ఇటు విమర్శకుల నుంచి ప్రశంసలు లభిస్తున్నాయి.  కథా కథనం, పదునైన మాటలకు  జనం నీరాజనాలు పడుతున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement