
‘‘కమ్‌బ్యాక్ ఎప్పుడూ సెట్‌బ్యాక్ కన్నా బలంగా ఉంటుంది’’ అని పేర్కొన్నారు సాయిధరమ్. అంటే.. బలమైన దెబ్బ నుంచి కోలుకుని బయటకు వస్తున్నప్పుడు..
సాయిధరమ్ తేజ్ ప్రమాదానికి గురై దాదాపు ఐదు నెలలవుతోంది. గత ఏడాది సెప్టెంబరులో ద్విచక్ర వాహనంపై వెళుతున్న సమయంలో సాయిధరమ్‌కి ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఆ తర్వాత రెండు మూడు సందర్భాల్లో కుటుంబ సభ్యులతో కలసి ఉన్న ఫొటోల్లో కనిపించారు. తాజాగా సంక్రాంతి పండగ వేడుకలకు సంబంధించి మెగా ఫ్యామిలీ షేర్ చేసిన వీడియోలో ‘పండగ శుభాకాంక్షలు’ చెప్పారు సాయిధరమ్.
ఆదివారం ట్విట్టర్‌లో ఓ ఫొటోను షేర్ చేసి, ‘‘కమ్‌బ్యాక్ ఎప్పుడూ సెట్‌బ్యాక్ కన్నా బలంగా ఉంటుంది’’ అని పేర్కొన్నారు సాయిధరమ్. అంటే.. బలమైన దెబ్బ నుంచి కోలుకుని బయటకు వస్తున్నప్పుడు ఇంకా బలంగా తయారవుతాం అని చెబుతున్నారు. సో.. త్వరలో సాయిధరమ్ షూటింగ్ సెట్‌లోకి ఎంటరవుతారని ఊహించవచ్చు.
The comeback is always stronger than the setback pic.twitter.com/2ssNlVR82Z
— Sai Dharam Tej (@IamSaiDharamTej) January 16, 2022