
సినీ నటుడు నందమూరి తారకరత్న పరిస్థితి అత్యంత విషమంగా ఉందని బెంగళూరు ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం ఎక్మోపై చికిత్స అందిస్తున్నామని స్పష్టం చేశారు. ఆయన ఆరోగ్యాన్ని 10 మంది వైద్యుల బృందం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుందని తెలిపారు. ఈ వార్త విన్న సినీ ప్రముఖులు తారకరత్న కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. ఇప్పటికే నందమూరి కల్యాణ్‌రామ్ ట్వీట్ చేయగా.. మెగా హీరో సాయి ధరమ్ తేజ్ తారకరత్న ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ఈ వార్త తనకు తీవ్రంగా కలిచివేసిందని అన్నారు.
ట్వీట్ సాయి ధరమ్ తేజ్ రాస్తూ..' ఈ వార్త నన్ను తీవ్రంగా కలిచివేసింది. తారకరత్న అన్న త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. మీరు ఆరోగ్యంగా, మరింత దృఢంగా తిరిగి రావాలని ఆ దేవుడిని ఆశిస‍్తున్నా. మా ప్రార్థనలు మీకు ఎప్పుడు అండగా ఉంటాయి. ' అని పోస్ట్ చేశారు. తారకరత్న ఆరోగ్య పరిస్థితి మాత్రం ఇంకా క్రిటికల్‌గానే ఉందని వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేసిన నేపథ్యంలో అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
Disheartening to know this.
— Sai Dharam Tej (@IamSaiDharamTej) January 28, 2023
Wishing a speedy recovery for #TarakaRatna Anna.
Keeping you in all our prayers that you come back healthy & stronger 🙏
Comments
Please login to add a commentAdd a comment