‘సూపర్ మ్యాన్ ఏం చేశాడంటే’... ‘అబ్బా ఈ స్పైడర్ మ్యాన్‌లు.. సూపర్ మ్యాన్‌లు కాదు నాన్నా.. మన లోకల్ మ్యాన్ కథ ఏదైనా ఉంటే చెప్పు నాన్నా..’ అని చిన్నారి కూతురు అడుగుతుంది... అప్పుడు మొదలవుతుంది లోకల్ మ్యాన్ గురించి... ఆడు చిన్నప్పుడే చదువు మానేశాడనీ, అమ్మా నాన్న మాట వినలేదనీ, అన్ని చెడు అలవాట్లు ఉన్నాయనీ, పది రూపాయలుంటే పార్కులో, పది వేలుంటే పార్క్ హయత్‌లో ఉంటాడని చెప్పడంతో ఆ లోకల్ మ్యాన్ ఊర మాస్‌గా పెరిగినవాడని అర్థం అవుతుంది. అతని పేరు ‘గాంజా శంకర్’.
సాయి ధరమ్ తేజ్ టైటిల్ రోల్‌లో రూపొందుతున్న చిత్రం ‘గాంజా శంకర్’. సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్నారు. ఆదివారం సాయిధరమ్ పుట్టినరోజు సందర్భంగా గాంజా శంకర్ పాత్రను పరిచయం చేస్తూ, విడుదల చేసిన టీజర్‌లో పైన పేర్కొన్న డైలాగ్స్ ఉన్నాయి. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: భీమ్స్ సిసిరోలియో, కెమెరా: రిషీ పంజాబి, సమర్పణ: శ్రీకర స్టూడియోస్.
Comments
Please login to add a commentAdd a comment