![Sai Dharam Tej Virupaksha Ott Release On Netflix Goes Viral - Sakshi](/styles/webp/s3/article_images/2023/04/22/ciru.jpg.webp?itok=jFR5f_l8)
మెగా మేనల్లుడు, సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ నటించిన తాజా చిత్రం ‘విరూపాక్ష’. సంయుక్త మీనన్ హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రానికి కార్తీక్ దండు దర్శకత్వం వహించగా... శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్‌ఎల్‌పీ, సుకుమార్ రైటింగ్స్‌పై బీవీఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మించారు. ఈనెల 21న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది.
(ఇది చదవండి: Virupaksha Review In Telugu: ‘విరూపాక్ష’ మూవీ రివ్యూ)
తాజాగా ఈ చిత్రానికి ఓ క్రేజీ న్యూస్ నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ సంస్థ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే నాలుగు వారాల తర్వాతనే ఈ చిత్రాన్ని ఓటీటీలో రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు సమాచారం. సాయి ధరమ్ తేజ్ బైక్ యాక్సిడెంట్ తర్వాత తెరకెక్కించిన చిత్రం కావడంతో అభిమానుల అంచనాలకు తగ్గట్టుగానే బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. అయితే ఓటీటీకి సంబంధించిన మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment