
సాయి ధరమ్ తేజ్, సంయుక్త మీనన్ జంటగా నటిస్తున్న చిత్రం 'విరూపాక్ష'. ఈ సినిమాకు కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ఈ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్, టీజర్‌కు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్.
ట్రైలర్ చూస్తే 'గ్రహణం నీడపట్టి విడిచేలోపు ఊరు అంతమైపోతుంది.. గుడిని, ఊరిని అష్ట దిగ్బంధనంతో మూసేయాలి' అంటూ స్వామీజి డైలాగ్ చెప్పడం, 'జరుగుతున్న చావులకు నేను కారణం తెలుసుకుని తీరుతాను' అని సాయి ధరమ్ తేజ్ డైలాగ్ , ఇక్కడ ఎవరికైనా చావుకి ఎదురెళ్లే దమ్ముందా' అని సునీల్ డైలాగ్.. 'జరగబోయే మారణహోమాన్ని ఎవరూ ఆపలేరు' అంటూ మరో స్వామీజి చెప్పడం.. 'చివర్లో ఈ రుద్రవణాన్ని కాపాడే విరూపాక్షవి నువ్వే' అంటూ హీరోను ఉద్దేశించి చెప్పే డైలాగ్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతున్నాయి. రోడ్డు ప్రమాదం నుంచి కోలుకున్న తర్వాత చాలా గ్యాప్ ఇచ్చిన సాయితేజ్ నుంచి వస్తున్న సినిమా ఇదే కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
కాగా.. ఇటీవలే 'ధనుశ్' సార్ సినిమాతో సక్సెస్ అందుకున్న సంయుక్త మీనన్.. ఈ చిత్రంలో తేజ్ సరసన నటిస్తోంది. పాన్ ఇండియాగా రూపొందుతున్న ఈ సినిమా.. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీలో ఈ నెల 21వ తేదీన రిలీజ్ కానుంది. కాగా.. ఈనెల 16న ఏలూరు సీఆర్ రెడ్డి కాలేజీలో ఈ మూవీ ప్రీ రిలీజ్‌ను గ్రాండ్‌గా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.