సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న తాజా చిత్రం విరూపాక్ష. సంయుక్త మీనన్ ఇందులో హీరోయిన్‌గా నటిస్తుంది. కార్తీక్ వర్మ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపుదిద్దుకున్న ఈ సినిమాను ఏప్రిల్ 21న విడుదల చేయనున్నారు. ఈ క్రమంలో ప్రమోషన్స్ జోరు పెంచిన మేకర్స్ తాజాగా ఈ మూవీ టీజర్‌ను రిలీజ్ చేశారు.
నిజానికి నిన్నే(సోమవారం) టీజర్ విడుదల కావాల్సి ఉండగా సాయిధరమ్ తేజ్ అభిమాని గుండెపోటుతో మృతిచెందడంతో టీజర్ రిలీజ్‌ను వాయిదా వేసిన సంగతి తెలిసిందే. సాయితేజ్ కెరీర్‌లోనే తొలి పాన్‌ఇండియా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమా తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ కానుంది.
Comments
Please login to add a commentAdd a comment