ప్రేమించడం ఎంత ముఖ్యమో తెలుసుకున్నా: సాయి ధరమ్ తేజ్ | Sai Dharam Tej Post Goes Viral On Valentines Day Wishes | Sakshi
Sakshi News home page

Sai Dharam Tej: మన జీవితంలో విలువైనదేంటో గ్రహించా: సాయి ధరమ్ తేజ్

Published Tue, Feb 14 2023 12:37 PM | Last Updated on Tue, Feb 14 2023 1:17 PM

Sai Dharam Tej Post Goes Viral On Valentines Day Wishes - Sakshi

రిపబ్లిక్ సినిమా తర్వాత యాక్సిడెంట్‌కు గురి కావడంతో సినిమాలకు కాస్తా బ్రేక్ ఇచ్చాడు సాయి ధరమ్ తేజ్ . ఆ సినిమా విడుదలైన ఏడాదిన్నరకు తాజాగా విరూపాక్ష సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ఈ చిత్రంలో మలయాళ భామ సంయుక్త మీనన్ అతనికి జంటగా నటిస్తోంది. వాలెంటైన్స్ సందర్భంగా మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ఓ ఆసక్తికర పోస్ట్ చేశారు. 'హౌ టూ ఫాల్ ఇన్ లవ్' పుస్తకం చదువుతున్న ఫోటోలను తన ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. ఈ అందమైన పుస్తకాన్ని నేను కేవలం నిద్ర పోయేందుకు చదువుతానని సరదాగా రాసుకొచ్చారు. ఈ సందర్భంగా అభిమానులకు హీరో వాలెంటైన్స్ డే శుభాకాంక్షలు తెలిపారు. 

సాయి ధరమ్ తేజ్ తన ఇన్‌స్టాలో రాస్తూ..' నేను ఈ అందమైన పుస్తకాన్ని పరిశోధించడానికి ప్రయత్నించా(కేవలం నిద్ర పోవడానికి). మన జీవితంలో అత్యంత ముఖ్యమైంది ప్రేమ. ఈ పుస్తకం ద్వారా మనల్ని మనం ప్రేమించడం ఎంత ముఖ్యమో నేను గ్రహించా. సెల్ఫ్ లవ్ అంటే మనలోని ప్రత్యేకతలు, లోపాలను స్వీకరించడం. అలాగే మనల్ని మనం ప్రేమించుకోవడం గురించి ఈ పుస్తకంలో ఉంది.' అంటూ పోస్ట్ చేశారు. ఇది సాయి ధరమ్ తేజ్ అభిమానులు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. అన్నా మనకు లవ్‌ మ్యారేజ్ సెట్‌ కాదు అంటూ పోస్టులు పెడుతున్నారు. ఈ పోస్టుకు బాలీవుడ్ నటి సయామి ఖేర్ నవ్వుతున్న ఎమోజీని జతచేసింది. 

కాగా.. విరూపాక్షలో సాయి ధరమ్ తేజ్ సరసన సంయుక్తా మీనన్ కథానాయికగా నటిస్తున్నారు. సాయి చంద్, బ్రహ్మాజీ, రాజీవ్ కనకాల, సునీల్, అజయ్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ దాదాపు పూర్తయినట్లు తెలుస్తోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement