Samyuktha Menon Gifted iPhone To Virupaksha Director Karthik Dandu - Sakshi
Sakshi News home page

Samyuktha Menon : 'విరూపాక్ష' డైరెక్టర్‌కి సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌ ఇచ్చిన సంయుక్తా మీనన్‌

Published Thu, Apr 27 2023 7:01 PM | Last Updated on Thu, Apr 27 2023 7:39 PM

Samyuktha Menon Gifted Iphone To Virupaksha Director Karthik Dandu - Sakshi

మెగా మేనల్లుడు సాయిధరమ్‌ తేజ్‌, సంయుక్తా మీనన్‌ జంటగా నటించిన సినిమా విరూపాక్ష. కార్తీక్‌ దండు దర్శకత్వం వహించిన ఈ చిత్రం సూపర్‌ హిట్‌ అయిన సంగతి తెలిసిందే. హర్రర్ థ్రిల్లర్ జానర్‌లో తెరకెకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద అదిరిపోయే కలెక్షన్లతో కమర్షియల్‌ సక్సెస్‌ని సొంతం చేసుకుంది. చదవండి: ప్రతీకారంతో జైలుపాలు.. డ్రగ్స్‌ కేసులో నిర్దోషిగా తేలిన హీరోయిన్‌

సినిమా రిలీజ్‌ అయిన ఆరు రోజులకు కూడా బాక్సాఫీస్‌ వద్ద అదిరిపోయే కలెక్షన్స్‌తో దూసుకుపోతుంది. సినిమా గ్రాండ్‌ సక్సెస్‌ కావడంతో హీరోయిన్‌ సంయు​క్తా మీనన్‌ డైరెక్టర్‌ కార్తీక్‌ దండుకు సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌ ఇచ్చి షాకిచ్చింది.

ఈ విషయంపై సంయుక్తా మాట్లాడుతూ.. 'మూవీ హిట్‌ కావడంతో కార్తీక్‌కి ఏదైనా గిఫ్ట్‌ ఇవ్వాలనుకున్నా. విరూపాక్ష రిలీజ్‌ రోజు ఓ థియేటర్‌లో అతని ఫోన్‌ ఎవరో కొట్టేశారు. దీంతో సినిమా రెస్పాన్స్‌ చూడటానికి వేరే వాళ్ల ఫోన్లలో చూసేవాడు. అందుకే వెంటనే ఐఫోన్‌ను కొని గిఫ్ట్‌గా ఇచ్చాను' అంటూ చెప్పుకొచ్చింది.

చదవండి: డైరెక్టర్‌ లింగుస్వామికి ఊరట.. జైలు శిక్షపై స్టే


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement