
అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న బిగ్ బాస్ తెలుగు సీజన్-7 సెప్టెంబర్ 3న అట్టహాసంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈసారి ఎవరూ ఊహించని విధంగా 14 మంది కంటెస్టెంట్లు హౌస్‌లోకి అడుగుపెట్టారు. ఈ సీజన్‌లో ఎప్పటినుంచో బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టాలని కలలు కంటున్న ఓ రైతు బిడ్డ కూడా ఉన్నారు. అతనే పల్లవి ప్రశాంత్. రైతు కుటుంబం నుంచి వచ్చిన పల్లవి ప్రశాంత్ సోషల్ మీడియాలో వీడియోలు పోస్ట్ చేస్తూ ఫేమస్ అయ్యాడు. ఎప్పటికైనా జీవితంలో ఒక్కసారైనా బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లాలనేది తన కల చాలాసార్లు చెప్పేవాడు. చివరికీ ఈ సీజన్‌లో అతని కల నెరవేరింది. అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్న బిగ్‌బాస్ సీజన్-7తో అతని కల ఫలించింది.
అయితే బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇస్తూనే నాగార్జునకు అదిరిపోయే గిఫ్ట్ తీసుకెళ్లాడు. రైతు బిడ్డగా తన పొలంలో పండించిన బియ్యాన్ని నాగార్జునకు బహుకరించాడు. మా బాపు మీకు గిఫ్ట్‌గా పంపిచారంటూ బస్తాను మోసుకెళ్లి మరీ ఇచ్చారు. బిగ్ బాస్ హౌస్‌లో అడుగుపెడుతూనే ఒక రైతు బిడ్డ ఎలా ఉంటాడో చూపించాడు. కాగా.. కామన్ మ్యాన్ కేటగిరీలో బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టాడు. షోలో పార్టిసిపేట్ చేయాలన్న కల నెరవేర్చుకున్నాడు. మరీ రాబోయే రోజుల్లో హౌస్‌లో రైతు బిడ్డ గేమ్ ఎలా ఉండబోతుందో తేలనుంది.
ఎగతాళి చేశారు
'ఉద్యోగం చేయాలంటే ఒకరి కింద బతకాలి.. కానీ ఇక్కడ పని చేసుకుంటే నేను, నా కుటుంబం బతుకుతుంది. నలుగురి కడుపు నింపుతామన్న సంతోషం ఉంటుంది. ఫోక్ సాంగ్స్ చేస్తే దాని ద్వారా వచ్చిన డబ్బు నా స్నేహితులు తీసేసుకుని మోసం చేశారు. నేను చచ్చిపోతా అంటే మా నాన్న కూడా చచ్చిపోతా అన్నాడు. అప్పుడే నేను సోషల్ మీడియాలో వీడియోలు పెట్టడం మొదలుపెట్టాను. కొందరు ఎంకరేజ్ చేశారు, మరికొందరు ఎగతాళి చేశారు. బిగ్‌బాస్ కోసం ఒక అడుగు ముందుకేశా. రైతుబిడ్డగా గర్వపడుతున్నా' అన్నాడు పల్లవి ప్రశాంత్.
‘బాపు’ అంటే తెల్వకపోతే ఎట్ల కాక నీకు @iamnagarjuna 🥲 pic.twitter.com/SGzOk2Zd0H
— 🅺🅳🆁 (@KDRtweets) September 4, 2023
Finally You Made it Wish you All the best for #BiggBossTelugu7 #PallaviPrasanth pic.twitter.com/LUBaPVWIkR
— Vinay (@vinayHere3) September 3, 2023
Comments
Please login to add a commentAdd a comment