'బిగ్‌బాస్ 7' షో అయిపోయి చాలారోజులైపోయింది. రైతుబిడ్డ అనే ట్యాగ్‌తో షోలో అడుగుపెట్టి విజేతగా నిలిచిన పల్లవి ప్రశాంత్.. రూ.35 లక్షల ప్రైజ్‌మనీతో రైతులకు సాయం చేస్తానన్నాడు. మూడు నెలల కావస్తున్నా ఇంకా దాని గురించి ఊసేలేదని తెగ విమర్శలు వచ్చాయి. షోలు చేసుకుంటూ, ఎంజాయ్ చేస్తున్నాడని అందరూ మనోడిని తెగ ట్రోల్ చేశాడు. ఫైనల్‌గా ఇన్నాళ్లకు మాట నిలబెట్టుకున్నాడు. తొలి సాయం చేశాడు.
(ఇదీ చదవండి: హీరో కిరణ్ అబ్బవరంతో నిశ్చితార్థం.. హీరోయిన్ ఎమోషనల్ పోస్ట్)
గతంలో జరిగిన ఆరు సీజన్ల కంటే ఈసారి బిగ్‌బాస్.. ఊహించిన దానికంటే ఎక్కువగా వార్తల్లో నిలిచింది. దీనికి కారణం పల్లవి ప్రశాంత్. రైతుబిడ్డ అనే ట్యాగ్‌తో వచ్చి షోలో సింపతీ కొట్టేశాడు. జనాలు కూడా ఇతడిని చెప్పింది నిజమా అబద్ధమా అనేది చూడకుండా నమ్మేశారు. ఓట్లు వేశారు. ఇక షోలో విజేతగా నిలిచిన తర్వాత అదే రోజు రాత్రి.. హైదరాబాద్‌లో ఇతడి ఫ్యాన్స్ చేసిన హంగామా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కార్లు, బస్సుల అద్దాల పగలగొట్టి నానా రచ్చ చేశారు.
ఆ తర్వాత పల్లవి ప్రశాంత్‌ని కొన్నిరోజలు జైల్లో పెట్టడం, బెయిల్‌పై బయటకు రావడం ఇలా ఒకదాని తర్వాత ఒకటి జరిగాయి. అయితే షోలో పల్లవి ప్రశాంత్ చెప్పినట్లు పేద రైతులకు సాయం చేస్తానని మాట మాత్రం మరిచిపోయాడా అని సందేహం వచ్చింది. అయితే తనపై వస్తున్న విమర్శలకు చెక్ పెడుతూ.. గజ్వేల్‌లోని కొలుగురూ గ్రామానికి చెందిన ఓ రైతు కుటుంబానికి ఏకంగా రూ.లక్ష సాయమందించాడు. తల్లిదండ్రులు కోల్పోయిన ఇద్దరు పిల్లల కోసం రూ.లక్షతో పాటు ఏడాదికి సరిపడా బియ్యాన్ని అందజేశాడు. ఇతడికి తోడుగా సందీప్ మాస్టర్ రూ.25 వేలు సాయం చేయడం విశేషం. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో సందీప్-ప్రశాంత్ పోస్ట్ చేశారు.
(ఇదీ చదవండి: రాజమౌళి సలహా.. పద్ధతి మార్చుకున్నా: స్టార్ హీరోయిన్)
Comments
Please login to add a commentAdd a comment