Virupaksha Heroine Samyuktha Menon About Actress Roles in Movies - Sakshi
Sakshi News home page

Samyuktha: విరూపాక్ష కోసం చాలా రిస్క్‌ చేశా, భవిష్యత్తులో ఆ ప్రశ్న తలెత్తకూడదు!

May 1 2023 7:05 AM | Updated on May 1 2023 11:14 AM

Virupaksha Heroine Samyuktha Menon About Actress Roles in Movies - Sakshi

ఏ విషయంలోనైనా తాను ముందు ఓకే చెప్పి ఆ తరువాతే ఆలోచిస్తానని చెప్పింది. విరూపాక్ష వంటి కమర్షియల్‌ కథా చిత్రంలో కథానాయిక పాత్రకు ప్రాధాన్యతను ఇవ్వడం అన్నది అభినందించదగ్గ వి

కోలీవుడ్‌లో వరుసగా రెండు సక్సెస్‌లను అందుకుని జోరుమీదున్న నటి సంయుక్త. మాలీవుడ్‌లో నటిగా మంచి పేరు తెచ్చుకున్న ఈ మలయాళ బ్యూటీ ఇంతకుముందు ధనుష్‌ కథానాయకుడిగా తమిళం, తెలుగు భాషల్లో నటించిన వాత్తీ చిత్రంలో హీరోయిన్‌గా నటించింది. ఆ సినిమా సక్సెస్‌ కావడంతో పాటు ఆమెకు మంచి పేరు వచ్చింది. దీంతో వెంటనే విరూపాక్ష అనే మరో తెలుగు చిత్రంలో నటించే అవకాశాన్ని దక్కించుకుంది. హీరో సాయి ధరమ్‌ తేజ్‌ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం గత వారం విడుదలై మంచి విజయాన్ని అందుకుంది.

ఇందులో నటి సంయుక్త నటనకు అవకాశం ఉన్న పాత్రలో నటించింది. కాగా విరూపాక్ష చిత్రం తమిళంలోనూ అనువాదం అయి ఈనెల 5వ తేదీన తెరపైకి రాబోతుంది. ఈ సందర్భంగా శనివారం చైన్నెలో మీడియాతో ముచ్చటించిన నటి సంయుక్త ఏ విషయంలోనైనా తాను ముందు ఓకే చెప్పి ఆ తరువాతే ఆలోచిస్తానని చెప్పింది. విరూపాక్ష వంటి కమర్షియల్‌ కథా చిత్రంలో కథానాయిక పాత్రకు ప్రాధాన్యతను ఇవ్వడం అన్నది అభినందించదగ్గ విషయం అని పేర్కొంది.

ఈ చిత్రం కోసం చాలా రిస్క్‌ చేసి నటించినట్లు చెప్పింది. భవిష్యత్‌లో కథానాయికల పాత్రలకు ప్రాముఖ్యత ఉంటుందా? అన్న ప్రశ్నకు తావే ఉండరాదని పేర్కొంది. దయచేసి దర్శక, నిర్మాతలు మహిళా పాత్రలకు ప్రాధాన్యత నివ్వాలని విజ్ఞప్తి చేసింది. ప్రతిభావంతమైన నటీమణులు ఇక్కడ చాలా మంది ఉన్నారనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. తమిళంలో మరిన్ని చిత్రాలలో నటించాలని కోరుకుంటున్నానని నటి సంయుక్త పేర్కొంది.

చదవండి: ఢీ డ్యాన్స్‌ షో కొరియోగ్రాఫర్‌ ఆత్మహత్య

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement