List of movies releasing this week on Theatres and OTT platforms - Sakshi
Sakshi News home page

Theatres And OTT Releases: ఈ వారం థియేటర్లు, ఓటీటీల్లో అలరించే సినిమాలివే!

Published Mon, Apr 17 2023 11:15 AM | Last Updated on Mon, Apr 17 2023 11:31 AM

This Week Theatres And OTT Release Movies List  - Sakshi

ప్రస్తుతం సినీ ప్రేక్షకులు ఓటీటీలపైనే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. థియేటర్లకు వెళ్లి సినిమా చూడలేని వారు ఫ్యామిలీతో కలిసి ఇంట్లోనే చూసేందుకు ఇష్టపడుతున్నారు. ప్రతి వారం సినీ ప్రియులను అలరించేందుకు చిత్రాలు రెడీ ఉన్నాయి. అలాగే ఈ వారంలో థియేటర్లలో సందడి చేసే చిత్రాలు కూడా ఉన్నాయి. అవేంటో ఓ లుక్కేద్దాం. 

 సాయి ధరమ్‌ తేజ్ 'విరూపాక్ష'

సాయిధరమ్‌ తేజ్‌, సంయుక్త మీనన్‌ జంటగా నటించిన తాజా చిత్రం 'విరూపాక్ష'. ఈ చిత్రానికి దర్శకుడు కార్తిక్‌ దండు తెరకెక్కించారు.తెలుగు, తమిళ భాషల్లో రూపొందించిన ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్, టీజర్‌, ట్రైలర్ ఆడియెన్స్‌ను బాగా ఆకట్టుకున్నాయి. ఈ చిత్రం ఏప్రిల్ 21న థియేటర్లలో సందడి చేయనుంది

 సింగిల్ క్యారెక్టర్‌తో 'హలో మీరా'

గార్గేయి యల్లాప్రగడ ప్రధానపాత్రలో తెరకెక్కుతున్న చిత్రం 'హలో మీరా'. ఈ చిత్రం ద్వారా కాకర్ల శ్రీనివాసు దర్శకుడిగా ఎంట్రీ ఇస్తున్నారు. కేవలం ఓకే ఒక్క క్యారెక్టర్‌తో సినిమా తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని సస్పెన్స్‌ డ్రామా థ్రిల్లర్‌గా రూపొందించారు. ఈ సినిమా కథ మొత్తం మీరా అనే పాత్ర చూట్టే తిరుగుతుంది. ఈ సినిమా ఏప్రిల్‌ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ వారం ఓటీటీ చిత్రాలు/వెబ్‌సిరీస్‌లు

నెట్‌ఫ్లిక్స్‌

  •     హౌ టు గెట్‌ రిచ్‌ (ఇంగ్లీష్‌)         - ఏప్రిల్‌ 18
  •     చింప్‌ ఎంపైర్‌ (డాక్యుమెంటరీ) -ఏప్రిల్‌ 19
  •     ది మార్క్‌డ్‌ హార్ట్‌ (సీజన్‌2)         - ఏప్రిల్ 19
  •     చోటా భీమ్‌ (సీజన్‌-17)               - ఏప్రిల్‌ 20
  •     టూత్‌పరి (హిందీ)                     - ఏప్రిల్‌ 20
  •     డిప్లొమ్యాట్‌ (ఇంగ్లీష్‌)                  - ఏప్రిల్‌ 20
  •     సత్య2 (తెలుగు)                         -ఏప్రిల్‌ 21
  •     రెడీ (తెలుగు)                              -ఏప్రిల్‌ 21
  •     ఇండియన్‌ మ్యాచ్‌ మేకింగ్‌ (వెబ్‌సిరీస్‌) - ఏప్రిల్‌ 21
  •     ఎ టూరిస్ట్స్‌ గైడ్‌ టు లవ్‌ (ఇంగ్లీష్‌) - ఏప్రిల్‌ 21

    సోనీలివ్‌

  •     గర్మీ (సిరీస్‌)

హాట్‌స్టార్‌

  •     సుగా (డాక్యుమెంటరీ)- ఏప్రిల్‌ 21


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement