అరుదైన అవకాశం ఇది!
రాహుల్ రవీంద్రన్, వెన్నెల కిశోర్, షానీ, భానుశ్రీ మెహ్రా, ఖుషి హెబా ముఖ్య తారలుగా రూపొందిన చిత్రం ‘అలా ఎలా’. ముప్పా వెంకయ్య చౌదరి సమర్పణలో అశోక్ వర్ధన్ నిర్మించిన ఈ చిత్రానికి అనీల్ కృష్ణ దర్శకుడు. ఈ చిత్రం ఆడియో వేడుకలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రముఖ నటుడు మురళీమోహన్ బేనర్ లోగోను ఆవిష్కరించారు. మరో అతిథి కోన వెంకట్ ఆడియో సీడీని ఆవిష్కరించారు. ఈ వేడుకలో పాల్గొన్న నాని, ఆది, ప్రిన్స్, లావణ్య త్రిపాఠి, రిచా పనయ్ తదితరులు చిత్రం విజయం సాధించాలని ఆకాంక్షించారు. రాహుల్ రవీంద్రన్ మాట్లాడుతూ -‘‘అప్‌కమింగ్ హీరోలకు అన్ని కోణాలున్న పాత్రలు చేసే అవకాశం రావడం కష్టం. అలాంటి అరుదైన అవకాశం ఈ చిత్రం ద్వారా నాకు లభించింది’’ అని చెప్పారు. మంచి పాటల కుదిరాయని చిత్రసంగీతదర్శకుడు భీమ్స్ తెలిపారు. ఇదొక చక్కని ప్రేమకథా చిత్రమనీ, ప్రస్తుత ట్రెండ్‌కి తగ్గట్టుగా ఉంటుందని దర్శక, నిర్మాతలు చెప్పారు.