షాకయ్యా! - ‘దిల్’ రాజు | Dil Raju buys Ala Ela Nizam's rights, released | Sakshi
Sakshi News home page

షాకయ్యా! - ‘దిల్’ రాజు

Published Tue, Dec 16 2014 11:34 PM | Last Updated on Sat, Sep 2 2017 6:16 PM

షాకయ్యా! - ‘దిల్’ రాజు

షాకయ్యా! - ‘దిల్’ రాజు

 ‘‘చిన్న సినిమా కదా... ప్రేక్షకులు ఏం చూస్తారులే అనుకున్నాను. యువతరం  చేసిన కొత్త  ప్రయత్నం కావడంతో కాదనలేక సినిమాను విడుదల చేశాను. కానీ... మూడోవారంలోకి అడుగుపెట్టాక కూడా వసూళ్లు నిలకడగా ఉండటంతో షాకయ్యా’’ అని ‘దిల్’ రాజు చెప్పారు. రాహుల్ రవీంద్రన్, వెన్నెల కిశోర్, షానీ సాల్మన్ ప్రధాన పాత్రధారులుగా అనీష్ కృష్ణ దర్శకత్వంలో, అశోక్ వర్ధన్ నిర్మించిన చిత్రం ‘అలా ఎలా?’. నైజాంలో ఈ చిత్రాన్ని ‘దిల్’ రాజు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఈ చిత్రం గురించి హైదరాబాద్‌లో ఆయన విలేకరులతో ముచ్చటిస్తూ -‘‘ఈ మధ్యకాలంలో నేను ఇంతగా ఎంజాయ్ చేసిన సినిమా మరొకటి లేదంటే అతిశయోక్తి కాదు. అసభ్యత అనేది లేకుండా అందరికీ నచ్చేలా దర్శకుడు ఈ సినిమాను మలిచాడు. మంచి స్క్రిప్ట్‌తో వస్తే... అతనితో సినిమా చేయడానికి నేను సిద్ధం’’ అని చెప్పారు. చిత్ర బృందం కూడా మాట్లాడారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement