Ala Ela
-
అదిరిపోయే ఆఫర్లు పట్టేస్తున్న కుమారి
-
దీనికి సీక్వెల్ చేస్తాం!
రాహుల్ రవీంద్రన్, వెన్నెల కిశోర్, శానీ సోలోమన్, ఖుషి, హెబ్బా పటేల్ ముఖ్య తారలుగా రూపొందిన చిత్రం ‘అలా ఎలా?’. అనీష్ కృష్ణ దర్శకత్వంలో అశోక్ వర్ధన్ నిర్మించిన ఈ చిత్రం ఇటీవలే విడుదలైంది. ఈ చిత్రం విజయవంతంగా ప్రదర్శితమవుతోందని చిత్ర యూనిట్ ఆనందం వెలిబుచ్చింది. ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ‘అందాల రాక్షసి’ తర్వాత తనకు అంత మంచి పేరు తెచ్చిన సినిమా ఇదేనని రాహుల్ రవీంద్రన్ చెప్పారు. ఇదే టీమ్‌తో ఈ సినిమాకుసీక్వెల్ చేయాలనుకుంటున్నామనీ, వచ్చే ఏడాది ప్రథమార్ధంలో షూటింగ్ మొదలుపెడతామనీ దర్శకుడు చెప్పారు. చిత్ర బృందంలో పలువురు ఈ కార్యక్రమంలో మాట్లాడారు. -
షాకయ్యా! - ‘దిల్’ రాజు
‘‘చిన్న సినిమా కదా... ప్రేక్షకులు ఏం చూస్తారులే అనుకున్నాను. యువతరం చేసిన కొత్త ప్రయత్నం కావడంతో కాదనలేక సినిమాను విడుదల చేశాను. కానీ... మూడోవారంలోకి అడుగుపెట్టాక కూడా వసూళ్లు నిలకడగా ఉండటంతో షాకయ్యా’’ అని ‘దిల్’ రాజు చెప్పారు. రాహుల్ రవీంద్రన్, వెన్నెల కిశోర్, షానీ సాల్మన్ ప్రధాన పాత్రధారులుగా అనీష్ కృష్ణ దర్శకత్వంలో, అశోక్ వర్ధన్ నిర్మించిన చిత్రం ‘అలా ఎలా?’. నైజాంలో ఈ చిత్రాన్ని ‘దిల్’ రాజు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఈ చిత్రం గురించి హైదరాబాద్‌లో ఆయన విలేకరులతో ముచ్చటిస్తూ -‘‘ఈ మధ్యకాలంలో నేను ఇంతగా ఎంజాయ్ చేసిన సినిమా మరొకటి లేదంటే అతిశయోక్తి కాదు. అసభ్యత అనేది లేకుండా అందరికీ నచ్చేలా దర్శకుడు ఈ సినిమాను మలిచాడు. మంచి స్క్రిప్ట్‌తో వస్తే... అతనితో సినిమా చేయడానికి నేను సిద్ధం’’ అని చెప్పారు. చిత్ర బృందం కూడా మాట్లాడారు. -
ఐడియా తెచ్చిన ఇక్కట్లు
పెద్దలు కుదిర్చిన పెళ్లిని ప్రేమపెళ్లిగా మార్చుకోవాలనే చిలిపి ఆలోచన ఓ కుర్రాడికి వస్తుంది. ఆ ఆలోచన వల్ల ఆ కుర్రాడు ఎలాంటి ఇక్కట్లు పడ్డాడు అనే కథాశంతో రూపొందిన చిత్రం ‘అలా ఎలా?’. రాహుల్ రవీంద్ర, వెన్నెల కిశోర్, భానుశ్రీ మెహ్రా, షానిసలోమో, ఖుషి, హెబ్బా పటేల్ ఇందులో ప్రధాన పాత్రధారులు. అనీష్ కృష్ణ దర్శకుడు. అశోక్‌వర్ధన్ నిర్మాత. ఈ నెల 28న ఈ సినిమా విడుదల కానుంది. ఇది రొమాంటిక్ కామెడీ మూవీ అని దర్శకుడు పేర్కొన్నారు. ఇప్పటివరకూ ఏ సినిమాలోనూ కనిపించని ఓ కొత్త ఫ్లేవర్ ఇందులో కనిపిస్తుందని రాహుల్ రవీంద్ర పేర్కొన్నారు. -
అరుదైన అవకాశం ఇది!
రాహుల్ రవీంద్రన్, వెన్నెల కిశోర్, షానీ, భానుశ్రీ మెహ్రా, ఖుషి హెబా ముఖ్య తారలుగా రూపొందిన చిత్రం ‘అలా ఎలా’. ముప్పా వెంకయ్య చౌదరి సమర్పణలో అశోక్ వర్ధన్ నిర్మించిన ఈ చిత్రానికి అనీల్ కృష్ణ దర్శకుడు. ఈ చిత్రం ఆడియో వేడుకలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రముఖ నటుడు మురళీమోహన్ బేనర్ లోగోను ఆవిష్కరించారు. మరో అతిథి కోన వెంకట్ ఆడియో సీడీని ఆవిష్కరించారు. ఈ వేడుకలో పాల్గొన్న నాని, ఆది, ప్రిన్స్, లావణ్య త్రిపాఠి, రిచా పనయ్ తదితరులు చిత్రం విజయం సాధించాలని ఆకాంక్షించారు. రాహుల్ రవీంద్రన్ మాట్లాడుతూ -‘‘అప్‌కమింగ్ హీరోలకు అన్ని కోణాలున్న పాత్రలు చేసే అవకాశం రావడం కష్టం. అలాంటి అరుదైన అవకాశం ఈ చిత్రం ద్వారా నాకు లభించింది’’ అని చెప్పారు. మంచి పాటల కుదిరాయని చిత్రసంగీతదర్శకుడు భీమ్స్ తెలిపారు. ఇదొక చక్కని ప్రేమకథా చిత్రమనీ, ప్రస్తుత ట్రెండ్‌కి తగ్గట్టుగా ఉంటుందని దర్శక, నిర్మాతలు చెప్పారు. -
లవ్.. రొమాన్స్.. కామెడీ...
రాహుల్ రవీంద్రన్, ‘వెన్నెల’ కిశోర్, షాని సాల్మన్, భానుశ్రీ మెహ్రా, ఖుషి, హెభా పటేల్ ముఖ్యతారలుగా రూపొందిన చిత్రం-‘అలా ఎలా?’. అనీష్ కృష్ణ దర్శకత్వంలో అశోకా క్రియేషన్స్ పతాకంపై ముప్పా వెంకయ్య చౌదరి సమర్పణలో అశోక్ వర్ధన్ ముప్పా ఈ చిత్రాన్ని నిర్మించారు. నిర్మాత మాట్లాడుతూ -‘‘లవ్.. రొమాన్స్.. కామెడీ.. ఈ మూడు అంశాల నేపథ్యంలో విభిన్నంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. కేరళ తదితర ప్రాంతాల్లో చిత్రీకరణ జరిపాం. భీమ్స్ సిసిరోలియో స్వరపరచిన పాటలు వినడానికి, చూడ్డానికి బావుంటాయి. ఈ నెల మూడోవారంలో పాటలను, వచ్చే నెల తొలి వారంలో చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అని తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: సాయిశ్రీరామ్.