Pondicherry Chief Minister
-
నయనతార భర్త.. ప్రభుత్వ భూమిపై కన్నేశాడా?
హీరోయిన్ నయనతార రీసెంట్ టైంలో చెప్పుకోదగ్గ సినిమాలేం చేయలేదు. కానీ ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తూనే ఉంది. దీనికి కారణం వివాదాలు. కొన్నాళ్ల క్రితం తమిళ స్టార్ హీరో ధనుష్‌తో పెద్ద గొడవే పెట్టుకుంది. ఇందులో నయన్ భర్త విఘ్నేశ్ కూడా ఉన్నాడు. ఇప్పుడు ఇతడిపై షాకింగ్ రూమర్స్ వచ్చాయి. ఏకంగా ప్రభుత్వ భూముల్నే కొనేందుకు ప్రయత్నిస్తున్నాడని అన్నారు. ఇప్పుడు దీనిపై స్వయంగా విఘ్నేశ్ క్లారిటీ ఇచ్చేశాడు.దర్శకుడు విఘ్నేశ్ శివన్.. ఈ మధ్య పుదుచ్చేరికి వెళ్లి ముఖ్యమంత్రి, పర్యాటక శాఖామంత్రిని కలిసి వచ్చాడు. అయితే పుదుచ్చేరి బీచ్ రోడ్లో ప్రభుత్వానికి చెందిన సీగల్ హోటల్ని కొనుగోలు చేసే ప్రయత్నాల్లో విఘ్నేశ్ ఉన్నాడని ప్రచారం మొదలైంది. అందుకే స్వయంగా సీఎంని కలిసి వచ్చాడనే పుకారు వచ్చింది. కానీ ప్రభుత్వ ఆస్తిని అమ్మడం కుదరదని పర్యాటక శాఖామంత్రి చెప్పడంతో విఘ్నేశ్ తిరిగొచ్చేశాడని మాట్లాడుకున్నారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 30 సినిమాలు)అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో పుకార్ల అన్ని అబద్ధాలే అని విఘ్నేశ్ శివన్ పేర్కొన్నాడు. తన పాండిచ్చేరి పర్యటన వెనకున్న కారణాన్ని ఇప్పుడు బయటపెట్టాడు. 'నా సినిమా 'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ' షూటింగ్ అనుమతి తీసుకునేందుకు అక్కడికి వెళ్ళాను. గౌరవ మర్యాదలతో ముఖ్యమంత్రిని, పర్యాటక శాఖా మంత్రిని కలిశాను. అనుకోకుండా, నాతో పాటు వచ్చిన లోకల్ మేనేజర్.. నా మీటింగ్ తర్వాత దేని గురించో వాళ్ళతో మాట్లాడారు. దీంతో ఆ చర్చ నాకోసమే అని పొరబడుతున్నారు. వస్తున్న రూమర్స్ ఏవి నిజం కాదు' అని విఘ్నేష్ శివన్ ఇన్ స్టా స్టోరీలో రాసుకొచ్చాడు.'నానుమ్ రౌడీ దానే' సినిమాతో దర్శకుడిగా మారిన విఘ్నేశ్ శివన్.. తొలి మూవీతో అద్భుతమైన సక్సెస్ అందుకున్నాడు. కానీ తర్వాత సినిమాలైతే చేస్తున్నాడు గానీ ఒక్కటంటే ఒక్కటి కూడా హిట్ అవ్వడం లేదు. మధ్యలో నయన్‌ని ప్రేమించి పెళ్లి చేసుకునే విషయంలో మాత్రం సక్సెస్ అయ్యాడు. ప్రస్తుతం 'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ' మువీ చేస్తున్నాడు. ప్రదీప్ రంగనాథన్, కృతిశెట్టి హీరోహీరోయిన్లు.(ఇదీ చదవండి: 'వరుడు' హీరోయిన్ భానుశ్రీ ఇంట్లో విషాదం) -
పాండిచ్చేరిని తాకిన రూ.300 వైద్యం
కర్నూలు(హాస్పిటల్): కరోనా వైరస్ నుంచి బాధితులు త్వరితగతిన బయటపడడానికి స్టేట్ కోవిడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రత్యేకాధికారి డాక్టర్ సి.ప్రభాకర్‌రెడ్డి సూచించిన రూ.300 వైద్యం ఇతర రాష్ట్రాలనూ ఆకర్షిస్తోంది. ఆదివారం రాత్రి పాండిచ్చేరి ముఖ్యమంత్రి వి.నారాయణస్వామి, ఆ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కృష్ణారావు తదితరులు అమెరికాకు చెందిన డాక్టర్లతో పాటు ప్రభాకర్‌రెడ్డితో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా పాండిచ్చేరిలో కరోనా తీవ్రత గురించి.. దాన్ని నియంత్రించడానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించినట్లు ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. ఈ సమయంలో రూ.300 వైద్యం గురించి మంత్రి కృష్ణారావు పాండిచ్చేరి సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు ప్రభాకర్‌రెడ్డి వివరించారు. పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మందుల గురించి వివరించానని.. దీనిపై సీఎం నారాయణస్వామి సంతృప్తి వ్యక్తం చేసినట్లు వెల్లడించారు. పాండిచ్చేరిలోనూ రూ.300 మందులు ఉచితంగా అందించేందుకు చర్యలు తీసుకుంటామని సీఎం చెప్పినట్లు ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. కరోనా నిర్ధారణ పరీక్ష ఫలితం వచ్చే వరకు వేచి ఉండకుండా రూ.300 మందులు వాడటంవల్ల మంచి ఫలితాలుంటాయని చెప్పారు. -
‘అది మోదీ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్’
సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్ ప్రజలను ప్రధాని నరేంద్ర మోదీ మోసం చేశారని పాండిచ్చేరి సీఎం నారయణ స్వామి అన్నారు. ఆయన ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ.. విభజన హామీలను పూర్తి చేసే విషయంలో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన వైఖరితో ఉందని తెలిపారు. రాష్ట్ర పునర్విభజన చట్టంలో ప్రత్యేక హోదా అంశాన్ని కాంగ్రెసే చేర్చిందని, ఈశాన్య రాష్ట్రాలతో సమానంగా హోదా ఇవ్వాలని పార్లమెంట్లో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ చెప్పారని గుర్తు చేశారు. దీనికోసం రూ. 40 వేల కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసారని, రాజధాని నిర్మాణం కోసం రూ. 50 వేల కోట్లు ఇవ్వాలని చెప్పామన్నారు. పోలవరానికి రూ. 2500 కోట్లు, అమరావతికి రూ.1500 కోట్లు ఇచ్చి చేతులు దులిపేసుకుంటే ఎలా అని ప్రశ్నించారు. ప్రధానమంత్రి విదేశి మంత్రిగా మారి విదేశాలకు తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. ఏపీని మోసం చేసిన బీజేపీకి కర్ణాటకలోని తెలుగు ప్రజలు బుద్ది చెప్పాలని పిలుపునిచ్చారు. సీబీఐ దర్యాప్తు వ్యవహారాల్లో కాంగ్రెస్ ఎప్పుడూ తలదూర్చలేదని, మోదీ మాత్రం జాతీయ దర్యాప్తు సంస్థలైన సీబీఐ, ఈడీ, ఆదాయపు పన్నుశాఖలను తన జేబులో పెట్టుకున్నారని ఆరోపించారు. ఇప్పుడది మోదీ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషనగా మారిందని ఎద్దేవా చేశారు. విదేశాల్లో నల్లధనం తెస్తానని, ప్రజల చేతులోని డబ్బులు లాగేసుకున్నారని మండిపడ్డారు. నోట్ల రద్దు, జీఎస్టీతో దేశ ప్రగతి కుంటుపడిందని, వృద్ధి రేటు 6 కే పరిమితం అయ్యిందని పేర్కొన్నారు. ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ కర్ణాటక ఎన్నికల్లో గెలువదని జోస్యం చెప్పారు. -
బజ్జీలు,పకోడీలు వేసిన పాండిచ్చేరి సీఎం
-
శ్రీవారి సన్నిధిలో పాండిచ్చేరి సీఎం
తిరుమల శ్రీవారిని మంగళవారం ఉదయం పాండిచ్చేరి ముఖ్యమంత్రి ఎన్.రంగస్వామి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అధికారులు ఆయనకు ఘనస్వాగతం పలికారు.