Kanmani Rambo Khatija Movie
-
ఈ వారం థియేటర్, ఓటీటీలో రాబోయే సినిమాలివే!
ఇప్పటిదాకా భారీ బడ్జెట్ చిత్రాలు థియేటర్లలో సందడి చేశాయి. మధ్యమధ్యలో కొన్ని చిన్న సినిమాలు కూడా ఓ మోస్తరు కలెక్షన్లు రాబట్టాయి. అయితే ఈ వారం మాత్రం ప్రేక్షకుడికి వినోదాన్ని పంచేందుకు ఓ మల్టీస్టారర్ మూవీ సిద్ధమైంది. ఇప్పటిదాకా కమర్షియల్ సినిమాలు చూసిన ప్రేక్షకుడిని కడుపుబ్బా నవ్వించేందుకు వస్తోంది ఎఫ్ 3. ఈ వారం థియేటర్లో రిలీజ్ అవుతున్న పెద్ద సినిమా ఇదొక్కటే ఉంది. అటు ఓటీటీ కూడా ఈ వారం సరికొత్త కంటెంట్‌తో ఎంటర్టైన్మెంట్ అందించేందుకు సై అంటోంది. మరి ఈ వారం అటు థియేటర్లో, ఇటు ఓటీటీలో రిలీజవుతున్న చిత్రాలేంటో చూసేయండి.. ఎఫ్ 3 వెంకటేశ్, వరుణ్ తేజ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ఎఫ్ 3. తమన్నా, మెహరీన్ కథానాయికలు. సోనాల్ చౌహాన్, సునీల్, రాజేంద్రప్రసాద్ ముఖ్య పాత్రల్లో నటించారు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ మూవీ మే 27న ప్రేక్షకులు ముందుకు వస్తోంది. మరి సమ్మర్ సోగ్గాళ్లు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తారో లేదో చూడాలి. అశోకవనంలో అర్జున కల్యాణం మాస్ సినిమాలతో ఫాలోయింగ్ తెచ్చుకున్న విశ్వక్సేన్ నటించిన లేటెస్ట్ మూవీ అశోకవనంలో అర్జున కల్యాణం. ఇందులో విశ్వక్ అద్భుతమైన నటన కనబర్చాడు. రుక్సార్ ధిల్లాన్ కథానాయికగా ఆకట్టుకుంది. మే 6న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. తాజాగా నెల రోజుల్లోనే ఓటీటీ బాట పట్టిన ఈ చిత్రం ఆహాలో మే 27 నుంచి స్ట్రీమింగ్ కానుంది. కణ్మణి రాంబో ఖతీజా విజయ్ సేతుపతి, నయనతార, సమంత ప్రధానపాత్రల్లో నటించిన ట్రయాంగిల్ లవ్ స్టోరీ కాతువాకుల రెండు కాదల్. విఘ్నేశ్ శివన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం తెలుగులో కణ్మణి రాంబో ఖతీజాగా విడుదలైంది. తాజాగా ఓటీటీ ట్రాక్ ఎక్కిన ఈ మూవీ మే 27 నుంచి హాట్‌స్టార్‌లో ప్రసారం కానుంది. అటాక్ జాన్ అబ్రహం హీరోగా నటించిన మూవీ అటాక్: పార్ట్ 1. జాక్వెలిన్ ఫెర్నాండేజ్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రకాశ్ రాజ్ కీలక పాత్రల్లో నటించారు. ఏప్రిల్1న థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర అంతంతమాత్రంగానే ఆడింది. జీ 5లో మే 27 నుంచి అందుబాటులోకి రానుంది. ఓటీటీలో ఇంకా ఏమేం సినిమాలు, వెబ్‌సిరీస్‌లు రానున్నాయంటే.. హాట్‌స్టార్ ఒబీ వ్యాన్ కెనోబి (వెబ్ సిరీస్) - మే 27 నెట్‌ఫ్లిక్స్ తులసీదాస్ జూనియర్ - మే 23 వెల్కమ్ టు వెడ్డింగ్ హెల్ - మే 23 స్ట్రేంజర్ థింగ్స్ (నాలుగో సీజన్) - మే 27 సోనీ లివ్ నిర్మల్ పాఠక్ కీ ఘర్ వాపసీ (వెబ్ సిరీస్) - మే 27 సేత్తుమాన్ - మే 27 చదవండి 👇 'ప్లాస్టిక్ సర్జరీలు చేసుకుని ఐశ్వర్యరాయ్ చివరకు ఇలా తయారైంది' బెడ్ సీన్ గురించి నెటిజన్ ప్రశ్న.. ఘాటుగా హీరోయిన్ రిప్లై -
ఓటీటీలో సామ్, నయన్‌ల మూవీ.. ఎప్పుడు? ఎక్కడంటే?
Kaathuvaakula Rendu Kaadhal OTT Release Date: విజయ్ సేతుపతి హీరోగా నయనతార, సమంత హీరోయిన్లుగా నటించిన చిత్రం 'కాతువాక్కుల రెండు కాదల్'. కామెడీ ట్రయాంగిల్ లవ్‌స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమా తెలుగులో కణ్మని రాంబో ఖతీజాగా రిలీజైంది. విఘ్నేశ్ శివన్ దర్శకత్వం వహించగా కోలీవుడ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ రవిచందర్ సంగీతం అందించాడు. రౌడీ పిక్చర్స్, సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ బ్యానర్‌పై విఘ్నేశ్, నయనతార, ఎస్ ఎస్ లలిత్ కుమార్ సంయుక్తంగా నిర్మించారు. ఏప్రిల్ 28న రిలీజైన ఈ మూవీ అటు కోలీవుడ్ ఇటు టాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇద్దరమ్మాయిలు కణ్మని, ఖతీజాల మధ్య రాంబో ఎలా నలిగిపోయాడన్నేదే సినిమా కథ. థియేటర్లలో రిలీజైన నెల రోజులకే ఓటీటీలో వస్తోంది. తాజాగా ఈ మూవీ ఓటీటీ బాట పట్టింది. హాట్‌స్టార్‌లో మే 27 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది హాట్‌స్టార్. థియేటర్లలో సినిమా చూడటం మిస్ అయినవాళ్లు మరికొద్ది రోజులు వెయిట్ చేసి ఓటీటీలో మూవీ చూసి ఎంజాయ్ చేయండి. Get the red carpet rolling, Kanmani and Khatija are here! #KaathuvaakulaRenduKaadhal starts streaming from 27th May#LoveyouTwo #KaathuvaakulaRenduKaadhal @VijaySethuOffl @VigneshShivN @Samanthaprabhu2 #Nayanthara @anirudhofficial @7screenstudio @Rowdy_Pictures #KRK pic.twitter.com/VBh9jplWD0 — Disney+ Hotstar (@DisneyPlusHS) May 18, 2022 చదవండి 👇 'మహేశ్‌బాబును ఇలా చూస్తామని జన్మలో అనుకోలేదు' అంటున్నారు కాస్మొటిక్ సర్జరీ వెంటపడుతున్న తారలు.. ప్రాణాలకు ప్రమాదం అని తెలిసినా డోంట్ కేర్! -
అప్పుడే ఓటీటీకి సమంత ‘కణ్మనీ రాంబో ఖతీజా’!, స్ట్రీమింగ్ ఎక్కడంటే..
Samantha Kanmani Rambo Khatija Movie Lock OTT Platform: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత, లేడీ సూపర్ స్టార్ నయన తార, విలక్షణ నటుడు, కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి కలిసి నటించిన చిత్రం 'కాతు వాకుల రెండు కాదల్'. రొమాంటిక్, కామెడీ ట్రయాంగిల్ లవ్‌స్టోరీగా తెరకెక్కిన ఈ చిత్రానికి విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహించారు. కోలీవుడ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించిన ఈ సినిమాను రౌడీ పిక్చర్స్, సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించాయి. చదవండి: హీరో నిఖిల్ ఇంట తీవ్ర విషాదం నేడు (ఏప్రిల్ 28) సమంత పుట్టినరోజు సందర్భంగా 'కణ్మనీ రాంబో ఖతీజా' పేరుతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ మూవీ. అయితే ఈసినిమా గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా తెలియదనే చెప్పాలి. దీంతో థియేటర్లో ఈ మూవీ మిక్స్డ్ టాక్‌ను తెచ్చుకుంది. ఇదిలా ఉంటే అప్పుడే ఈ మూవీ ఓటీటీ స్ట్రిమింగ్పై చర్చలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ మూవీ ఓటీటీ రైట్స్‌ను డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ సొంతం చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం హాట్‌స్టార్‌లో అఖండ, భీమ్లా నాయక్ వంటి పెద్ద సినిమాలు స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే. చదవండి: 'కణ్మనీ రాంబో ఖతీజా' మూవీ రివ్యూ అయితే వీటి ప్రభావం ఈ మూవీపై పడే అవకాశం ఉంది. దీంతో ఈ సినిమాను కాస్తా ఆలస్యంగానే స్ట్రీమింగ్ చేయాలని హాట్‌స్టార్ నిర్వహకులు అనుకుంటున్నారట. లేదంటే సాధారణంగా ఏ సినిమా అయిన థియేటర్లో విడుదలైన నాలుగు వారాలకు ఓటీటీలోకి వస్తుంది. అలాగే ‘కాతు వాక్కుల రెండు కాదల్’(కణ్మనీ రాంబో ఖతీజా) కూడా నాలుగు వారాల తర్వాత అంటే మే చివరి వారంలోనే ఓటీటీలో స్ట్రీమింగ్ చేస్తారని టాక్ వినిపిస్తుంది. మరి దీనిపై క్లారిటీ రావాలంటే అధికారిక ప్రకటన వచ్చేవరకు వేచి చూడాలి. -
'కణ్మనీ రాంబో ఖతీజా' మూవీ రివ్యూ
టైటిల్ : కణ్మనీ రాంబో ఖతీజా నటీనటులు : విజయ్ సేతుపతి, నయనతార, సమంత, ప్రభు, శ్రీశాంత్ తదితరులు నిర్మాణ సంస్థ: రౌడీ పిక్చర్స్ - సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ నిర్మాతలు: విగ్నేశ్ శివన్ - నయనతార - ఎస్.ఎస్.లలిత్ కుమార్ దర్శకుడు: విగ్నేశ్ సంగీతం: అనిరుథ్ సినిమాటోగ్రఫి:ఎస్.ఆర్.కధిర్ - విజయ్ కార్తీక్ కణ్ణన్ విడుదల తేది: ఏప్రిల్ 28,2022 టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత, లేడీ సూపర్ స్టార్ నయన తార, విలక్షణ నటుడు, కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి కలిసి నటించిన చిత్రం 'కాతు వాకుల రెండు కాదల్'. రొమాంటిక్, కామెడీ ట్రయాంగిల్ లవ్‌స్టోరీగా తెరకెక్కిన ఈ చిత్రానికి విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహించారు. కోలీవుడ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించిన ఈ సినిమాను రౌడీ పిక్చర్స్, సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించాయి. నేడు (ఏప్రిల్ 28) సమంత పుట్టినరోజు సందర్భంగా తెలుగులో 'కణ్మనీ రాంబో ఖతీజా' పేరుతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ మూవీ. మరీ ఈ మూవీ ఎలా ఉంది ? ఇద్దరు అమ్మాయిలైన కణ్మనీ, ఖతీజాల మధ్య రాంబో ఎలా నలిగిపోయాడు ? అనేది మూవీ రివ్యూలో చూద్దాం. కథేంటంటే..? రాంబో(విజయ్ సేతుపతి) పుట్టుకతోనే దురదృష్టవంతుడిగా పేరు తెచ్చుకుంటాడు. అతను పుట్టగానే తండ్రి చనిపోతాడు. తల్లి అనారోగ్యం పాలవుతుంది. దీంతో రాంబో కూడా నిజంగానే తాను దురదృష్టవంతుడినని, తన వల్లనే తల్లి అనారోగ్యపాలైందని భావించి చిన్నప్పుడే ఇంటి నుంచి పారిపోతాడు. తను ఇష్టపడిన వాళ్లకు కీడు జరుగుతుందని భావించి, మూడు పదుల వయసు వచ్చినా.. ప్రేమ, పెళ్లి జోలికి వెళ్లడు. అదే సమయంలో అతనికి పరిచయమవుతారు కన్మణి(నయనతార), ఖతీజా(సమంత). ఇద్దరిని సమానంగా ప్రేమిస్తాడు రాంబో. ఒకరితో పగలంతా గడిపితే.. మరొకరికి రాత్రి సమయం కేటాయిస్తాడు. అయితే ఓ రోజు కన్మణి, ఖతీజాలకు నిజం తెలుస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది? ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ పెళ్లి దాకా వెళ్లిందా? చివరకు రాంబో ఎవరిని పెళ్లి చేసుకున్నాడు. అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. విజయ్ సేతుపతి లాంటి గొప్ప నటుడితో సమంత, నయనతార లాంటి స్టార్ హీరోయిన్స్ కలిసి నటిస్తున్నారంటే.. ఆ సినిమాపై కచ్చితంగా భారీ అంచనాలే ఉంటాయి. దర్శకుడు కూడా అదే స్థాయిలో మంచి కథని ఎంచుకొని సినిమాను తెరకెక్కించే ప్రయత్నం చేస్తాడు. కానీ విగ్నేశ్ శివన్ మాత్రం పేలవమైన కథతో ‘కాతు వాకుల రెండు కాదల్’చిత్రాన్ని తెరకెక్కించాడు. స్టోరీని పక్కకు పెట్టి.. కేవలం స్టార్ క్యాస్ట్ మీదే ఎక్కువ ఆధారపడ్డాడు. కథ, కథనాల్లో పసలేకపోవడం వల్ల ఈ సినిమా పేలవంగా సాగుతుంది. హీరోని ఇద్దరు హీరోయిన్లు ప్రేమించడం.. అతన్ని దక్కించుకునేందుకు ఇద్దరు పోటీపడడం, వాళ్ల వల్ల హీరోకు సమస్యలు రావడం..చివరకు ఇద్దరితో హీరో కలిసి ఉండడం.. ఈ తరహా ట్రయాంగిల్ లవ్‌స్టోరీలు తెలుగు, తమిళ బాషలో చాలానే వచ్చాయి. ‘కణ్మనీ రాంబో ఖతీజా'లో కొత్తదనం ఏమీ లేకపోవడం.. కథనం చాలా నెమ్మదిగా సాగడంతో ఫస్టాఫ్ అంతో బోర్ కొడుతుంది. ఇంటర్వెల్ ముందు హీరో చెప్పే డైలాగ్ ఆకట్టుకుంటుంది. ఇక సెకండాఫ్‌లో అక్కడక్కడ కామెడీ, కొన్ని డైలాగ్స్ అలరించినా.. అంత ఆసక్తిగా మాత్రం కథనం సాగదు. ఎలాంటి ట్విస్టులు లేకుండా.. చాలా సింపుల్‌గా సినిమా ఉంటుంది. ప్రేక్షకులకు తెరపై స్టార్ క్యాస్ట్ తప్ప కథలో కొత్తదనం కనిపించదు. ఎమోషనల్ సీన్స్ కూడా వర్కౌట్ కాలేదు. రొటీన్ స్క్రీన్‌ప్లే. పాన్ ఇండియా సినిమాలు సందడి చేస్తున్న ఈ సమయంలో ఇలాంటి మూవీని ప్రేక్షకులు ఆదరించడం కాస్త కష్టమే. ఎవరెలా చేశారంటే.. విజయ్ సేతుపతి, నయనతార, సమంత తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. రాంబోగా విజయ్ అలరించాడు. సినిమాతో అతనికి పాత్రకే సరైన జస్టిఫికేషన్ ఉంది. అందువల్ల ఆడియన్స్ ఎక్కువగా రాంబో పాత్రకు కనెక్ట్ అవుతారు. ఇక కన్మణిగా నయనతార తనదైన నటనతో అదగొడితే.. ఖతీజాగా సమంత తన అందంతో ఆకట్టుకుంది. టీవీ షో వ్యాఖ్యాతగా ప్రభు, ఖతీజా తొలి బాయ్‌ప్రెండ్ మహ్మద్ మోబీగా శ్రీశాంత్ తమ, తమ పాత్రలకు న్యాయం చేశారు. (చదవండి: అర్థరాత్రి 12 గంటలకు.. సమంతకు విషెస్ చెప్పిన హీరో) ఇక సాంకేతిక విషయానికొస్తే.. ఈ సినిమాకు ప్రధాన బలం అనిరుథ్ సంగీతం. సినిమాలో మ్యాటర్ లేకున్నా.. తనదైన నేపథ్య సంగీతంతో లాక్కొచ్చాడు. ఎస్.ఆర్.కధిర్ - విజయ్ కార్తీక్ కణ్ణన్ ఫర్వాలేదు. ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్ తన కత్తెరకు ఇంకాస్త పనిచెప్పాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి. - అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్