సెప్టెంబర్ 15న పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు
ఈరోజు మీతో పాటు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు
రమ్యకృష్ణ (నటి), పి. వాసు (దర్శకుడు)
ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వారి సంవత్సర సంఖ్య 5. ఇది బుధసంఖ్య. పుట్టిన తేదీ 15. ఇది శుక్ర సంఖ్య. బుధ శుక్రుల కలయిక వల్ల లక్ష్మీ నారాయణ యోగం ఏర్పడి, విద్యార్థులు మంచి మార్కులతో ఉత్తీర్ణులై, కోరుకున్న విద్యాసంస్థలలో సీటు వస్తుంది. వ్యాపారులకు అభివృద్ధికరంగా ఉంటుంది. కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు. ఉద్యోగులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. వీరు పుట్టిన తేదీ శుక్రసంఖ్య అయినందువల్ల జీవితం ఉత్సాహంగా, సౌఖ్యవంతంగా గడిచిపోతుంది. వివాహ యత్నాలలో ఉన్న వారి ప్రయత్నాలు ఫలిస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం. మీడియా, సినీ రంగాలలో ఉన్న వారికి మంచి అవకాశాలు, గుర్తింపు వస్తాయి. కోపం తగ్గించుకోవడం మంచిది.
లక్కీ నంబర్స్: 5,6,9; లక్కీ కలర్స్: వైట్, క్రీమ్, గోల్డెన్, గ్రీన్, శాండల్; లక్కీ డేస్: ఆది, బుధ, శుక్రవారాలు. సూచనలు: తోబుట్టువులను ఆదుకోవడం, నవగ్రహాభిషేకం చేయించుకోవడం, బీదవిద్యార్థులకు పుస్తకాలు, ఆహారం పంపిణీ చేయడం మంచిది.
- డాక్టర్ మహమ్మద్ దావూద్