
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత జయలలిత జీవిత కథను సినిమాగా తెరకెక్కించేందుకు చాలా కాలంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. జయ జీవితంలో ఓ కమర్షియల్ సినిమాలకు కావాల్సిన అన్ని ఎమోషన్స్ ఉండటంతో చాలా మంది దర్శకనిర్మాతలు ఆమె కథను వెండితెరకెక్కించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు.
కేవలం సినిమాగానే కాకుండా డిజిటల్ ప్లాట్ ఫామ్స్‌లోనూ జయ కథ విడుదల కానుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ ఎమ్‌ఎక్స్ ప్లేయర్ జయ బయోగ్రఫిని వెబ్ సిరీస్ రూపంలో తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. గౌతమ్ మీనన్, ప్రశాంత్ మురుగేశన్‌లు సంయుక్తంగా డైరెక్ట్ చేస్తున్న ఈ వెబ్ సిరీస్ టైటిల్‌తో పాటు ఫస్ట్‌లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. క్వీన్ పేరుతో రూపొందుతున్న ఈ వెబ్ సిరీస్‌లో జయ పాత్రలో రమ్యకృష్ణ నటిస్తున్నారు.
ప్రస్తుతానికి టైటిల్‌ను మాత్రమే రివీల్ చేసిన చిత్రయూనిట్, జయ వేలాది మంది అభిమానులను పార్టీ కార్యకర్తలను ఉద్దేశిస్తూ ప్రసంగిస్తున్నట్టుగా ఉన్న పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌లో రమ్యకృష్ణ ముఖం రివీల్ కాకుండా జాగ్రత్త పడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment