
తమిళసినిమా: నటి రమ్యకృష్ణ ప్రధాన పాత్రలో ఆకాశగంగ–2 చిత్రం తెరకెక్కుతోంది. తమిళం, తెలుగు భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రానికి మలయాళ దర్శకుడు వినయన్ దర్శకత్వం వహిస్తున్నారు. మలయాళంలో ప్రముఖ దర్శకుడిగా పేరొందిన ఈయన కోలీవుడ్‌లో ఇంతకు ముందు విక్రమ్ హీరోగా కాశీ చిత్రానికి దర్శకత్వం వహించిన దర్శకుడీయన. అదే విధంగా ఆ తరువాత ఈయన తెరకెక్కించిన ఎన్.మన వానిల్, అర్పుత దీవు వంటి తమిళ చిత్రాలు మంచి సక్సెస్ అయ్యాయి. కాగా మలయాళంలో వినయన్ ఇటీవల దివంగత నటుడు కళాభవన్‌మణి జీవిత ఇతివృత్తంతో తెరకెక్కించిన సాలక్కుడిక్కారన్ సంగాది చిత్రం సంచలన విజయం సాధించింది.
తాజాగా ఆకాశగంగ–2 చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇది ఆయన ఇంతకుముందు రూపొందించిన ఆకాశగంగ చిత్రానికి సీక్వెల్. హర్రర్ కామెడీ చిత్రాలకు పేరు గాంచిన వినయన్ ఈ ఆకాశగంగ–2 చిత్రాన్ని ఆదే బాణీలో రూపొందిస్తున్నారు. ఇందులో ఆసీప్ అలీ, సిద్ధిక్, సలీమ్‌కుమార్, శ్రీనాథ్‌బాషీ, విష్ణు గోవింద్, హరీశ్‌కన్నన్, ధర్మరాజన్, ఆరతి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. వీరితో పాటు నటి రమ్యకృష్ణ ముఖ్యపాత్రలో నటిస్తున్నారు. చిత్రాన్ని ఆధునిక సాంకేతిక పరిజ్ఞనంతో భారీ బడ్జెట్‌లో తెరకెక్కిస్తున్నట్లు తెలిపారు. బీజీపాల్ సంగీతం, ప్రకాశ్‌కుట్టి ఛాయాగ్రహణం అందిస్తున్న ఈ చిత్రం ఇటీవలే ప్రారంభమై, పాలక్కాడు, కొ చ్చి, పొల్లాచ్చి ప్రాంతాల్లో చిత్రీకరణను జరుపుకుంటోందని చిత్ర వర్గాలు తెలిపారు. ఓనం పండగ నాటికి విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు చిత్ర వర్గాలు తెలిపాయి.
Comments
Please login to add a commentAdd a comment